తెలంగాణ

22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం- మంత్రి పొంగులేటి

4 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని 22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

22A: తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని 22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో వేగంగా, పకడ్బందీగా అమలు చేసి దరఖాస్తుదారులకు ఉపసమనం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.

22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై సచివాలయంలో కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల రిజిస్ట్రార్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

22ఏ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీఓ 118, జీవో 76లకు సంబంధించిన మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు, యూఎల్సీ దరఖాస్తుల పరిష్కారం, నాలా ప్రక్రియ పూర్తి కాని పట్టా భూముల సమస్యల పరిష్కారం, జీఓ 59 అమలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేస్తే సహించను

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక, 22ఏ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లు, రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పరిష్కారంలో జాప్యానికి తావు ఇవ్వకూడదన్నారు. కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. కలెక్టర్ల బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోనే సామాన్యులకు నిజమైన ప్రయోజనం కలుగుతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

#22A#22A Lands Row#Telangana#Ponguleti Srinivas Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి