IPSలలో హాట్ టాపిక్‌గా మారిన బదిలీ?
సర్వీస్ ఉన్నంత వరకు సీపీగానే ఉండేంత రాజకీయ పరిచయాలు?
కింది స్థాయి అధికారుల అవినీతి కంట్రోల్ చేద్దామనే లోపే?
అన్ని బాగోతాలు బయటపడ్డాయా?
రాజకీయ అరంగ్రేటం చేద్దామనే ఉద్దేశంలో ఎక్కడ బెడిసికొట్టింది?
స్వేచ్ఛ న్యూస్ విశ్లేణాత్మక కథనం..
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్.
అధికారి బదిలీలు అత్యంత సాధారణం. కానీ బలమైన ఆఫీసర్, కీలకమైన పోస్టింగ్ నుంచి బదిలీ చేయడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఎంతోమంధి అధికారులు తప్పులు చేసినా, కొంతమందికే వర్తించేలా పొలిటికల్ గేమ్ లు పావులు కదుపుతారు. సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్ చాలామందికి తెలియని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం.
బాస్ అంతా బాగుందనుకున్నారు?
హైదరాబాద్ సీపీగా సజ్జనార్ 13 నెలల్లో ఫుడ్ సేప్టీ, జోనల్ ఇన్వెస్టిగేషన్ టీం, వన్ వే లతో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇక తనకు కర్ణాటక కాంగ్రెస్ నేతల నుంచి పరిచయాలు ఉండటంతో హైదరాబాద్ సీపీగానే రిటైర్మెంట్ అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అనేక మంది నేతలు, బిజినెస్ మెన్స్, లాబియిస్టులు నమ్ముకున్నారు. సజ్జనార్ కూడా తన పొలిటికల్ కెరీర్ భవిష్యత్ ని సోషల్ మీడియా ద్వారా కర్ణాటకలో కూడా తెలిపేలా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ 300 ఎకరాల వరకు భూములు కూడా కొనుగోలు చేశారని అక్కడి పొలిటికల్ ప్రత్యర్ధులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
ఎక్కడ చెడిందంటే ?
హైదరాబాద్‌లో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. నడి రోడ్డుపైనే హత్యలు. కిందిస్థాయి అధికారుల అవినీతి భారీగా పెరిగింది. ఆయన చేయాల్సిన పనులంతా మరో ఆయన రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ కి అప్పగించారు. దీంతో ఈయన వేరే పనుల్లో టీంలు పెట్టుకుని బిజీగా ఉన్నారని ఐపీఎస్ అధికారుల్లో గుసగుసలు. ఒకే రాష్ట్రానికి చెందిన 12మంది అధికారులు ఏకమై అధిపత్యం కొనసాగించేలా అన్నింట్లో వేలు పెట్టడంతో మిగతా అధికారులు వీళ్ల అవినీతి బాగోతాలను కూడా తవ్వితీసినట్లు సమాచారం. దీంతో గత ఏడాదిగా జరిగిన క్రైంలు, వాటి వెనక జరిగిత తతంగం ఏంటో రిపోర్టులు సీఎం వద్దకు చేరాయి.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ని తప్పించే విషయంలో సీపీ మామ వ్యవహారంపై ఆనాటి నుంచే నిఘా పెంచడంతో సవాలక్ష ఆధారాలు దొరికిపోయాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ చార్జిషీట్ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయి. డీజీపీ స్థాయి పనులు కూడా సీపీగా చేస్తామనే ఉద్దేశ పూర్వక పనులు కూడా మిగతా సీనియర్ ఐపీఎస్ లకు చికాకు పెట్టించేలా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తుంది.
అవినీతి అధికారులపై చర్యలు అనే లోపే?
గత ఏడాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అవినీతి భారీగా పెరిగిందని, పోలీస్ స్టేషన్ కి వెళితే పనికో రేట్ లా తయారయ్యారని తెలుస్తుంది. బదీలీల్లో కూడా ఉన్నతాధికారులు చేతులు తడపాల్సి వచ్చిందనే అరోపణలు ఉన్నాయి. అందుకు జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డి పోస్టింగ్ కి డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఎంత దూరం వెళ్లాయో? నిఘావర్గాలు, ఏసీబీ దృష్టి సారించి అధారాలు సేకరించాయి. ఇలా భూకబ్జాదారుల వద్ద నుంచి ఎన్నెన్ని డబ్బులు ఎక్కడి బినామీలకు చేరాయో చిట్టా రెడీ చేశారు.
అయితే సీఎం కూడా సీపీ స్థాయిలో ఇలాంటి నెట్ వర్క్ పెంచుకోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు ముందే సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో వారం రోజులుగా సిటీలోని కింది స్థాయి అధికారుల అవినీతి అరోపణలపై వెంటనే స్పందించారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో తర్వలోనే తన కుటుంబంలో శుభకార్యం జరగాల్సిన సమయంలో ఇలాంటి బదిలీ జరగడంపై అనేక ఆధారాలు సీఎం వద్దకు చేరినట్లు సమాచారం.


