జాతీయం

Artificial Intelligence: పదేళ్లలోపే క్యాన్సర్ అంతమా? ఏఐ కంపెనీల గాలి తీసేసిన ఫార్మా!

5 నిమిషాల పఠనం

Artificial Intelligence: రాబోయే పదేళ్లలోపే క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు భూమ్మీద లేకుండా పోతాయా? వైద్య ప్రపంచంలో ఏఐ అద్భుతాలు సృష్టించబోతోందా? అవుననే అంటూ ప్రముఖ ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు టెక్, వైద్య వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

Artificial Intelligence: రాబోయే పదేళ్లలోపే క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు భూమ్మీద లేకుండా పోతాయా? వైద్య ప్రపంచంలో ఏఐ అద్భుతాలు సృష్టించబోతోందా? అవుననే అంటూ ప్రముఖ ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు టెక్, వైద్య వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. వేల ఏళ్లుగా మనుషులను వణికిస్తున్న మొండి వ్యాధులకు పదేళ్లలో చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ సంస్థ ఊదరగొడుతోంది. అయితే, ఏఐ కంపెనీల ఈ భారీ బిల్డప్‌పై ఔషధ తయారీ (ఫార్మా) కంపెనీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెబుతూ ఏఐ కంపెనీల గాలి తీసేస్తున్నాయి.

ఏఐ కంపెనీల 'పదేళ్ల మ్యాజిక్' లెక్కలివే!

సాధారణంగా ఒక కొత్త వ్యాధికి మందు కనిపెట్టాలంటే శాస్త్రవేత్తలకు దశాబ్దాల సమయం పడుతుంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఆ సుదీర్ఘ పరిశోధనలు కేవలం కొన్ని వారాలకే కుంచించుకుపోతాయని ఆంత్రోపిక్ అంచనా వేస్తోంది. క్యాన్సర్, గుండె జబ్బులతో పాటు మానసిక రుగ్మతలన్నింటికీ రానున్న పదేళ్లలోపే ఏఐ సాయంతో కచ్చితమైన పరిష్కారాలు దొరుకుతాయని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. మరో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వినిపించడంతో, ఇకపై ప్రాణాంతక జబ్బులకు భయపడాల్సిన పనిలేదన్న చర్చ మొదలైంది.

50 ఫార్ములాలు ఇస్తే.. ఒక్క మందు కూడా తయారు చేయలేకపోయాయి!

ఏఐ కంపెనీలు చెబుతున్న ఈ 'పదేళ్ల అద్భుతాల' మాటలను ఫార్మా దిగ్గజాలు "అవన్నీ పనికిమాలిన మాటలు" అంటూ నిర్మొహమాటంగా కొట్టిపారేస్తున్నాయి. కేవలం అంచనాలతో కాకుండా, ప్రాక్టికల్ సాక్ష్యాలతో ఏఐ కంపెనీల అసలు సామర్థ్యాన్ని బయటపెడుతున్నాయి. "మేము ప్రముఖ ఏఐ కంపెనీలకు దాదాపు 50 రకాల ఫార్ములా వివరాలను ఇచ్చాము. కానీ, ఏ ఒక్క ఏఐ కంపెనీ కూడా సొంతంగా ఒకే ఒక్క కొత్త మందును రూపొందించలేకపోయింది" అంటూ ఫార్మా వర్గాలు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నాయి. కంప్యూటర్ అల్గారిథమ్స్ వేయడానికి, మనిషి శరీరంపై పనిచేసే అసలైన మందును తయారు చేయడానికి మధ్య ఆకాశమంత తేడా ఉందని అవి స్పష్టం చేస్తున్నాయి.

అంచనాలా? ఆచరణా? అసలు నిజమేంటి?

మొత్తానికి ఒకవైపు ఏఐ దిగ్గజాలు వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేస్తామని భారీ ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు ఫార్మా కంపెనీలు వాస్తవాలను ఎత్తిచూపుతూ వాటి గాలి తీసేస్తున్నాయి. ఏఐ సాయంతో పరిశోధనల్లో వేగం పెరగడం నిజమే కావొచ్చు కానీ, పదేళ్లలోపే క్యాన్సర్ లాంటి వ్యాధులను తుడిచిపెట్టడం సాధ్యమయ్యే పని కాదని ఫార్మా నిపుణులు తేల్చిచెబుతున్నారు. మరి భవిష్యత్తులో ఏఐ కంపెనీల అంచనాలు నిజమవుతాయో, లేక ఫార్మా దిగ్గజాల వాదనే కరెక్ట్ అవుతుందో వేచి చూడాలి.

#Artificial Intelligence#AI in Healthcare#AI Drug Discovery#Cancer Research#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి