సినిమా

Tollywood: OG 2, OG 3లపై థమన్ అప్‌డేట్..స్పీకర్లు పగిలిపోయే స్క్రిప్ట్ రెడీనా?

4 నిమిషాల పఠనం

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కలెక్షన్ల గురించి అందరికీ తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే ఇది ఎవరూ ఊహించనిది. ఆ తర్వాతనే, దర్శకుడు సుజీత్-పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ చేయాలని డిసైడయ్యారు. ఆల్రెడీ పక్కాగా ఓజీ 2 కథ సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం, సుజీత్ నాని హీరోగా బ్లడీ రోమియో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ఢిల్లీలో పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్ కూడా శరవేగంగా హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో, నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇటీవలే, ఒక పాత్రకి సంబందించిన లుక్ రివీలై సోషల్ మీడియాలో వైరల్ అయింది. నానీని కూడా బ్లడీ రోమియో సినిమాలో స్టైలిష్ గ్యాంగ్ స్టర్‌గా చూపిస్తున్నాడు.

వీలైనంత త్వరగా బ్లడీ రోమియోను పూర్తి చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఓజీ 2ని సెట్స్‌పైకి తీసుకురానున్నాడు. దీనికి, సంబందించి మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా అప్‌డేట్ ఇచ్చాడు. సుజీత్..స్పీకర్లు బద్ధలయ్యే స్క్రిప్ట్ రెడీ చేశాడని..ఓజీ 2 మాత్రమే కాకుండా దీనికి కొనసాగింపుగా ఓజీ 3 కూడా రెడీగా ఉందని ఫ్యాన్స్ ఊగిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో, పవర్ స్టార్ అభిమానులే కాకుండా సినీ లవర్స్ కూడా ఓజీ 2 అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్..మళ్ళీ సినిమా చేస్తే అది ఓజీ 2నే అవుతుంది. ఓజీ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా మొదలవ్వాల్సింది. కానీ, పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్‌ను ఇంప్రెస్ చేయలేపోయింది. అందుకే, ప్రస్తుతానికి, ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. కథ పక్కాగా కుదిరితేనే సూరి సినిమా ఉంటుంది. లేదంటే పూర్తిగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావచ్చు కూడా. కాగా, 2027 సమ్మర్ నుంచి ఓజీ 2 మొదలయ్యే అవకాశాలున్నాయి. ఏకంగా 70 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 2 కోసం డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

#Director Sujeeth#OG 2#OG 3#S.Thaman#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి