Nvidia CEO Resigns: ప్రపంచ టెక్, ఏఐ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీ 'ఎన్విడియా'లో ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. ఆ సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కంపెనీని అగ్రస్థానంలో నిలిపిన హువాంగ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎఫైర్ వివాదంలో చిక్కుకుని పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
చైనా గూఢచారితో ఎఫైర్.. మరో మహిళతోనూ సంబంధం
గత కొద్ది రోజులుగా జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంపై సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ అనే మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు హువాంగ్ ఇటీవలే ప్రకటించడం పెద్ద దుమారం రేపింది. ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, తాజాగా మరో మహిళతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వరుసగా బయటపడిన ఈ ఎఫైర్ వార్తలు కంపెనీ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపేలా మారడంతో, ఒత్తిడి తట్టుకోలేక హువాంగ్ తన సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
తాత్కాలిక సీఈవోగా కొలెట్ క్రెస్..
జెన్సన్ హువాంగ్ రాజీనామా నేపథ్యంలో కంపెనీ బాధ్యతలను ప్రస్తుతానికి కొలెట్ క్రెస్‌కు అప్పగించారు. ఎన్విడియా తాత్కాలిక (ఇంటరిమ్) సీఈవోగా కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఏఐ చిప్స్ మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎన్విడియా అధినేత, ఇలా ఎఫైర్ వివాదాలతో అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడం టెక్, బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


