సినిమా

Tollywood: మొన్న థియోట్రికల్..ఇప్పుడు ఓటీటీ డీల్..వారణాసి కి కళ్ళు చెదిరే ఆఫర్!

4 నిమిషాల పఠనం

Tollywood: మన తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమాకి సంబందించి బిజినెస్ డీల్స్ మొదలయ్యాయి. మొన్నీమధ్యే..మైత్రీ మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రిలీజ్ కోసం భారీ ఆఫర్‌ను ఇచ్చారు. 290 కోట్లకి డీల్ కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, 300 కోట్లని తాజాగా కన్‌ఫర్మ్ అయింది.

ఇక, మిగతా భాషలకి సంబందించిన థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే, దిగ్గజ ఓటీటీ వారు ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి అంతటా సర్క్యులేట్ అవుతోంది. వారణాసి ఓటీటీ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ కళ్ళు బైర్లు కమ్మే ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం మొదలైంది.

కేవలం సినిమా ఒక్కటే కాకుండా.. మేకింగ్ కి సంబందించిన జక్కన్న స్టైల్, వారణాసి సినిమా ట్రావెలింగ్ కి సంబందించిన విజువల్స్..దీనితో పాటు అన్ సీన్ ఫుటేజ్, అలాగే ఓ స్పెషల్ డాక్యుమెంటరీ కంటెంట్‌ సహా మొత్తం కలిపి ప్యాకేజ్ గా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురిచేస్తున్న విషయం.. ఈ డీల్ విలువ. వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 400 నుంచి 500 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్న వార్త.

బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఊహించని విధంగా పెరిగింది. దీంతో, ఆ రెండు సినిమాల కంటే గ్లోబల్ వైడ్‌గా 120 దేశాలలో 50 భాషలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న వారణాసి సినిమా బిజినెస్ ప్రతీ ఒక్కరు నోరెళ్ళబెట్టేలా క్లోజ్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రీ బిజినెస్ రూపంలోనే దాదాపు 4000 కోట్ల వరకూ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో నటిస్తోన్న మొదటి గ్లోబల్ మూవీ కావడం విశేషం. ఈ సినిమా బడ్జెట్ 1400 కోట్ల వరకూ ఉంటుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది.

#Varanasi#SS.Rajamouli#Mahesh Babu#Priyanka Chopra#Varanasi Business
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి