జాతీయం

Consumer Rights: రూపాయి కోసం రెండేళ్ల న్యాయపోరాటం.. ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికుడు!

3 నిమిషాల పఠనం

Consumer Rights: "ఒక్క రూపాయే కదా.. పోతే పోనీలే" అని సాధారణంగా ఎవరైనా సరే తేలిగ్గా వదిలేస్తారు. కానీ కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఆ ఒక్క రూపాయి కోసం ఏకంగా రెండేళ్ల పాటు వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేశాడు.

Consumer Rights: "ఒక్క రూపాయే కదా.. పోతే పోనీలే" అని సాధారణంగా ఎవరైనా సరే తేలిగ్గా వదిలేస్తారు. కానీ కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఆ ఒక్క రూపాయి కోసం ఏకంగా రెండేళ్ల పాటు వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేశాడు. తన హక్కుల విషయంలో రాజీ పడకుండా కన్స్యూమర్ కోర్టు మెట్లు ఎక్కి, చివరకు రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఒక్క రూపాయి బకాయికి బదులుగా ఏకంగా రూ. 3,100 పరిహారం రాబట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

అసలేం జరిగిందంటే?

కేరళకు చెందిన సంజయ్ రాజ్ కాడగౌడ్ అనే ప్రయాణికుడు 2024 ఆగస్టు 17న తన రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూల్స్ ప్రకారం టికెట్ రద్దు చేసిన తర్వాత తిరిగి రావాల్సిన రీఫండ్ అమౌంట్‌లో ఐఆర్‌సీటీసీ ఒక్క రూపాయి తక్కువగా జమ చేసింది. కేవలం రూపాయే అయినా, సర్వీస్ లోపం విషయంలో మౌనంగా ఉండకూడదని సంజయ్ డిసైడ్ అయ్యారు. వెంటనే ఐఆర్‌సీటీసీ తీరును సవాలు చేస్తూ కన్స్యూమర్ కమిషన్‌లో కంప్లైంట్ చేశారు.

రూ. 1 కి.. రూ. 3,100 జరిమానా

ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్, ఇటీవల (అక్టోబర్ 5, 2026న) సంచలన తీర్పు ఇచ్చింది. ప్రయాణికుడికి ఇవ్వాల్సిన రీఫండ్‌లో ఒక్క రూపాయి తగ్గించడం కచ్చితంగా ఐఆర్‌సీటీసీ సేవా లోపమేనని కమిషన్ తేల్చి చెప్పింది. బాధితుడికి రావాల్సిన ఆ ఒక్క రూపాయి బకాయిని వడ్డీతో సహా తిరిగి చెల్లించడంతో పాటు, ఇబ్బంది పెట్టినందుకు అదనంగా రూ. 3,100 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.కస్టమర్ల హక్కుల విషయంలో సంస్థలు ఎంత బాధ్యతగా ఉండాలో, అలాగే సామాన్యులు తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, సంజయ్ పట్టుదలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

#Consumer Rights#IRCTC#IRCTC Refund#IRCTC News#Kerala Passenger#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి