సినిమా

Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Nivetha Thomas: నివేదా థామస్..సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో నివేదా థామస్ చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఆమె స్క్రీన్‌కి దూరమయ్యారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారు. అయితే, ఓనం పండుగ సందర్భంగా నివేదా థామస్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. చక్కగా చీరలో మెరిసింది.

Nivetha Thomas: నివేదా థామస్..సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో నివేదా థామస్ చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఆమె స్క్రీన్‌కి దూరమయ్యారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారు. అయితే, ఓనం పండుగ సందర్భంగా నివేదా థామస్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. చక్కగా చీరలో మెరిసింది. అంతేకాదు, మునపటిలా బొద్దుగా కాకుండా క్యూట్‌గా కనిపించింది. దీంతో, ఆమెకి మళ్ళీ హీరోయిన్‌గా ఛాన్సులు రావడం గ్యారెంటీ అంటున్నారు.

నాని 'జెంటిల్ మేన్' తో టాలీవుడ్ ఎంట్రీ:

తెలుగులో నివేదా థామస్ చేసిన మొదటి సినిమా నాని డ్యూయల్ రోల్ లో నటించిన 'జెంటిల్ మేన్'. ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. నానికి మంచి జోడీ అని కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత నాని తోటే 'నిన్ను కోరి' సినిమా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో, స్టార్ హీరో ఎన్‌టిర్ సరసన 'జైలవకుశ' సినిమాలో ఛాన్స్ అందుకుంది.

Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!

ఈ సినిమాలోనూ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే, '118', 'బ్రోచేవారెవరురా'.. సినిమాలు చేసి మంచి ప్రశంసలు అందుకుంది. కథ నచ్చితేనే సినిమా ఒప్పుకునే నివేదా, ఎప్పుడు కూడా హద్దులు దాటి స్కిన్ షో చేసే పాత్రలను, అందాల ఆరబోతతో ఘాటైన సన్నివేశాలను చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే, తెలుగులో మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ పెద్ద కమర్షియల్ హీరోయిన్‌గా పాపులర్ అవలేదు.

Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!

నాని నటించిన 'వి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్', రెజీనాతో కలిసి 'శాఖిని ఢాకిని', ఆ తర్వాత 35 ఒక చిన్న కథ కాదు లాంటి సినిమాలు చేసింది. 'వకీల్ సాబ్' మూవీలో చేసిన పల్లవి పాత్ర మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తన ఫిజిక్‌లో వచ్చిన మార్పుల కారణంగా సినిమా అవకాశాలు రాలేదు. అయితే, తాజాగా మలయాళీల పండుగ ఓనం సందర్భంగా నివేదా థామస్ ట్రెడీషనల్‌గా తయారైంది.

Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!

దీనికి, సంబందించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి, చూసిన అభిమానులు..నివేదా చాలా స్లిమ్ అయింది. మళ్ళీ హీరోయిన్‌గా అవకాశాలు వచ్చేస్తాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా, ఈ మలయాళీ భామ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా అలరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది.

#Nivetha Thomas#Actress Nivetha Thomas#Tollywood Actress Nivetha Thomas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి