Nani-The Paradise: టాలీవుడ్ అగ్ర నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా 'ది ప్యారడైజ్' థియేట్రికల్ రైట్స్ దక్కలేదు. సాధారణంగా ఒకప్పుడు చిన్న సినిమా నుంచి పెద్ద హీరో సినిమా వరకూ ఎక్కువశాతం నైజంలో సినిమాను డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు దక్కించుకునేవాడు. కానీ, గత కొన్నేళ్లుగా ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి, పోటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నాని సినిమా అయినా కూడా దిల్ రాజు దక్కించుకోలేకపోయాడు.
ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్న సినిమా 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటించారు. స్పెషల్ నంబర్‌లో కీర్తి సురేష్ కనిపించబోతుంది. మోహన్ బాబు, సంపూ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ నెక్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ఇక, ప్రస్తుతం డే అండ్ నైట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది.
అలాగే యూఎస్ సహా ఇతర దేశాలలో ఒకరోజు ముందుగానే సినిమా రిలీజ్ కాబోతోంది. మన ఇండియాలో కూడా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ పడబోతున్నాయి. థియేట్రికల్ ట్రైలర్ లేకపోయినా మిగతా సౌత్ భాషలలో సినిమాను ప్రమోట్ చేయకపోయినా కూడా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇప్పుడు, థియేట్రికల్ బిజినెస్ కూడా అంతే పోటీగా జరుగుతోంది.
నైజాం మొత్తం మైత్రీవారు.. అలాగే, సుధాకర్ చెరుకూరి, సితార నాగవంశీ రిలీజ్ చేయనున్నారు. 50 శాతం థియేట్రికల్ రిలీజ్ రైట్స్‌ను మైత్రీ వారు, 25శాతం నిర్మాత, మరో 25 శాతం నాగవంశీ తీసుకున్నారు. దీంతో, ఈసారి భారీ లెవల్‌లో పాన్ ఇండియా వైడ్‌గా వస్తోన్న 'ది ప్యారడైజ్' రైట్స్ దిల్ రాజు మిస్ అయ్యాడు. ఈ మధ్య అటు నిర్మాణ రంగంలో, ఇటు డిస్ట్రిబ్యూషన్ పరంగా నైజాంలో దిల్ రాజుకి వీరు గట్టి పోటీ ఇస్తున్నారు.









