ప్రపంచం

US : లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసం

రచన: Kumar4 నిమిషాల పఠనం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అల్లరిమూకలు రెచ్చపోయారు.నగరంలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ (ICE) విభాగం చేపట్టిన కఠినమైన వలస విధానాలు, దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున అల్లర్లు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిరసన ప్రదర్శనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి.

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అల్లరిమూకలు రెచ్చపోయారు.నగరంలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ (ICE) విభాగం చేపట్టిన కఠినమైన వలస విధానాలు, దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున అల్లర్లు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిరసన ప్రదర్శనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో భద్రతాబలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (Metropolitan Detention Center) వెలుపల వేలాది మంది ప్రదర్శనకారులు గుమిగూడి ఫెడరల్ ఏజెంట్లపైకి రాళ్లు, సీసాలు విసిరినట్టు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాస్ ఏంజిల్స్ నగరంలో 'టాక్టికల్ అలర్ట్' ప్రకటించి నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి టియర్ గ్యాస్, పెప్పర్ బాల్స్ ఉపయోగించినట్టు తెలుస్తోంది.

అయితే, ఈ ఆందోళనల్లో భాగంగా కొందరు అల్లరిమూకలు దుకాణాల అద్దాలు పగలగొట్టి, వస్తువులను లూటీ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టడంతో పాటు ప్రభుత్వ బస్సులు, భవనాలపై గ్రాఫిటీ రాసి ధ్వంసం చేసినట్టు కథనాలు వస్తున్నాయి. రూ.50 కోట్లు ($600,000) విలువైన 'వేమో' సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు అల్లరిమూకలు నిప్పు పెట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున నగరంలో పొగ కమ్ముకోవడంతో బలగాలు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

https://x.com/RTVnewsnetwork/status/2098953326381703414?s=20

భద్రతా కారణ దృష్ట్యా గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్' సర్వీసులను రద్దు చేసినట్టు సమాచారం. అల్లరిమూకలను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను లాస్ ఏంజిల్స్ పోలీసులు (LAPD)విశ్లేషిస్తున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించారు. పదుల సంఖ్యలో ప్రదర్శనకారులను, నిరసనల పేరిట హింసకు పాల్పడిన పలువురిని స్థానిక పోలీసులు, ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక యంత్రాంగంతో పాటు నేషనల్ గార్డ్ దళాలను కూడా రంగంలోకి దించినట్టు సమాచారం.

#los angels#protests#migrants#assests#damage#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి