తెలంగాణ

TG: లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే? రూట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌..

3 నిమిషాల పఠనం

హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్క్ వద్ద అమలు చేస్తున్న 'వన్ వే' విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, అదే తరహాలో లక్డీకాపూల్‌లోనూ కొత్త వన్ వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

TG: హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్క్ వద్ద అమలు చేస్తున్న 'వన్ వే' విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, అదే తరహాలో లక్డీకాపూల్‌లోనూ కొత్త వన్ వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ఇతర అధికారులతో కలిసి స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని క్షుణ్ణంగా చూసిన సీపీ సజ్జనార్‌.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రతిపాదిత వన్ వే రూట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓల్డ్ కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి, ఇక్బాల్ మినార్, సచివాలయం మార్గాల మధ్య రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు మూడు కీలక మార్గాలను ప్రతిపాదించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖలతో సమన్వయ సమావేశం పూర్తి చేసిన అనంతరం తొలుత ప్రయోగాత్మకంగా ఈ వన్ వేను అమలు చేయనున్నారు.

మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద రద్దీని తట్టుకునేందుకు అదనంగా మరో లేన్ ఏర్పాటు చేయాలని సీపీ సజ్జనార్‌ ఆదేశించారు. దీనికి అడ్డంకిగా ఉన్న అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్లు, విద్యుత్ స్తంభాలను త్వరగా తరలించాలని స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ తరహాలోనే నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు దశలవారీగా వన్ వే విధానాన్ని విస్తరించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

#Hyderabad Traffic#Lakdikapul Traffic#Hyderabad News#Telangana News#One Way Traffic#Traffic Diversion#VC Sajjanar#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి