Kajal Aggarwal: కాజల్ రామాయణ చేయడం అనవసరమా? తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇతిహాసం ఆధారంగా వచ్చిన మైథలాజికల్ మూవీ రామాయణ చూశాక కాజల్ అభిమానులకి కలుగుతున్న సందేహం ఇది. సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం, మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లకు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే పాత్రలు దక్కవు. అలాంటి పరిస్థితినే కాజల్ అగర్వాల్ ఎదుర్కొంటోంది. పెళ్లి కుదరగానే మెల్టీస్టారర్ సినిమా ఆచార్య వదులుకోవాల్సి వచ్చింది. పెళ్లై ఓ బిడ్డకి తల్లైయ్యాక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాలో కాజల్ పాత్ర ఓకే. కానీ, ఆ తర్వాత నుంచే ఆశించిన స్క్రీన్ స్పేస్ దక్కడం లేదు.
రామాయణలో "మందోదరి"గా కనిపించిన కాజల్:
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో కాజల్ అగర్వాల్‌కు మందోదరి పాత్ర దక్కింది. రావణుడి భార్యగా, లంకాధిపతి కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా మందోదరి పాత్రకు రామాయణంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పాత్రలో కాజల్ కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.
అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని కాజల్ స్వయంగా వెల్లడించడం చర్చనీయాంశమైంది. మొదటి భాగంలో లంకకు సంబంధించిన సన్నివేశాలు తక్కువగా ఉండటంతో మందోదరిగా తన పాత్ర కూడా పరిమితంగానే ఉంటుందని ఆమె వివరించింది. భారీ ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పింది. కానీ, మరీ, పార్ట్ 1 లో 5 నిముషాల పాటు కూడా స్క్రీన్ మీద కనిపించలేదు.
అంటే, ఇదే రామాయణ పార్ట్ 2లో కాజల్ పోషించిన మండోదరి పాత్రను చూడాలంటే ఇంకో ఏడాది వరకూ ఆగాల్సిందే. కొందరి హీరోయిన్స్ కి సెకండ్ ఇన్నింగ్ అద్భుతంగా సాగితే, ఇంకొందరికి మాతేం ఏమాత్రం కెరీర్‌కి ఉపయోగపడని పాత్రలను చేయాల్సి వస్తోంది. ఈ లిస్ట్‌లో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఉందా.! అనే సందేహాలు కలుగుతున్నాయి. మళ్ళీ, టాలీవుడ్లో సీనియర్ హీరోల సరసన భారీ హిట్ పడి సక్సెస్ ట్రాక్ ఎక్కితేగానీ ఈ సందేఅహలన్నిటికీ ఫుల్స్టాప్ పడదు.


