తెలంగాణ

వారితోనూ రాజీనామా చేయించి ఎన్నికలకు రండి- సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్

రచన: NK5 నిమిషాల పఠనం

Disqualification: దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై బీఆర్ఎస్, బీజేపీ స్పందించాయి. హైకోర్టు తీర్పు ఆ రెండు పార్టీల నాయకులు స్వాగతించారు. న్యాయస్థానం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా అభివర్ణించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని, పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

''కోర్టు తీర్పు చెంప పెట్టు. ప్రభుత్వం చెంప పగలగొట్టింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి. ఇకనైనా ఈ బురద రాజకీయాలు మానేయాలి. రాహుల్ గాంధీ కూడా అర్థం చేసుకోవాలి. నీతి సూత్రాలు వల్లించడం కాదు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో నీతిమయంగా, రాజ్యాంగబద్ధంగా మీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తేనే మీ మాటలు ఎవరైనా నమ్ముతారు.

మిగతా వారిపై స్పీకర్ వేటు వేయాలి

మీ పార్టీ అధికారంలో ఉన్న చోట రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతాము.. అధికారంలో లేని చోట పోయి నీతి సూత్రాలు చెబుతాము అంటే రాహుల్ గాంధీని ఎవరూ నమ్మరు. ఇప్పటికైనా ఆ మిగతా 9మందిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు అప్పీల్ చేస్తున్నా. హైకోర్టు తీర్పు తర్వాతనైనా మీరు రివ్యూ చేయండి, వారిపై అనర్హత వేటు వేయండి'' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

''దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నాం. బీజేపీ అనేక రోజులుగా ఈ అంశంపై పోరాటం చేస్తోంది. న్యాయం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ కోర్టును ఆశ్రయించింది. స్పీకర్ అనేక రకాలుగా దానం నాగేందర్ ను కాపాడే ప్రయత్న చేసినప్పటికి.. స్పీకర్ తీర్పును కొట్టేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

రాజీనామా చేయించి ఎన్నికలకు రండి..

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించింది. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలి. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈరోజు బీజేపీ న్యాయం వైపు నిలబడి పోరాటం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసింది. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టుకి వెళ్లకుండా.. వెంటనే పార్టీ ఫిరాయించిన మిగతా వారితోనూ రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి'' అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

#Disqualification#Brs#Congress#Bjp#Harish Rao#Alleti Maheshwar Reddy#Danam Nagender#Swechaa News#Telangana High Court
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి