తెలంగాణ

TG : నేడు ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభం

4 నిమిషాల పఠనం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్‌ను సుమారు రూ.54 కోట్లతో నుంచి రూ. 60 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఆదిలాబాద్ పట్టణ శివారులోని జాతీయ రహదారి-44 సమీపంలో ఈ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్‌ను సుమారు రూ.54 కోట్లతో నుంచి రూ. 60 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఆదిలాబాద్ పట్టణ శివారులోని జాతీయ రహదారి-44 సమీపంలో ఈ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

కేవలం హైదరాబాద్ మహానగరానికే పరిమితం కాకుండా టైర్-2 నగరాలకు ఐటీ సేవలను విస్తరించడంలో భాగంగా, స్థానిక చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ఐటీ హబ్ ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక జిల్లాల్లోనూ ఈ ఐటీ టవర్స్ నిర్మించి స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించారు. చిన్న చిన్న సంస్థలు స్థాపించే వారికి రాయితీలు సైతం కల్పించారు.

ఇదిలాఉండగా, తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఆదిలాబాద్ ఐటీ టవర్ నిర్మాణం, ప్రారంభోత్సవం ఆలస్యం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఐటీ టవర్‌ను మూడేళ్లు సాగదీసి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రారంభిస్తున్నదని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

గత బీఆర్ఎస్ హయాంలోనే ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట పట్టణాలలో ఐటీ టవర్లు ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఈ ఐటీ టవర్లకు కరెంట్, ఇంటర్నెట్ కూడా సరఫరా చేయలేక రేవంత్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే కేసీఆర్ హయాంలోని స్సీమ్స్, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.

#adilabad#IT tower#inaguration#minister sridherbabu#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి