క్రైమ్

Crime : నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం.. 14 మంది అరెస్ట్!

4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ఘరానా మోసం వెలుగుచూసింది. పదవీ విరమణ పొందిన తర్వాత మరణించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుక్కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించేందుకు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.నల్గొండ జిల్లాలో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.

రాష్ట్రంలో ఘరానా మోసం వెలుగుచూసింది. పదవీ విరమణ పొందిన తర్వాత మరణించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుక్కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించేందుకు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.నల్గొండ జిల్లాలో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది. దీంతో స్థానికులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.కారుణ్య ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలిస్తుండగా అవి నకిలీగా తేల్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ మోసం బట్టబయలైంది.

వివరాల్లోకివెళితే.. నల్గొండలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, సర్వీసులో ఉండగానే రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినట్లు రికార్డులు తారుమారు చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉద్యోగి కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు యత్నించారు. విషయం కాస్త లీక్ అవ్వడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిసింది.

ఆధార్ చిరునామా వివరాలు మార్చి నకిలీ డెత్ సర్టిఫికెట్, తప్పుడు అధికారిక రికార్డులు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో రూ.13 లక్షల ఆర్థిక ఒప్పందం జరిగినట్లు గుర్తించారు. రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు, మృత ఉద్యోగి ఫొటోను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 299/2026గా BNS, ఐటీ చట్టం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు కేసును ఛేదించారు.కాగా, నిందితులకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

#fake documents#government job#Compassionate Appointments#14 members arrest#nalgonda#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి