ఆధ్యాత్మికత

Zodiac Predictions: ఈ ఏడాది ముగిసేలోగా ఆ రాశులకు డేంజర్ బెల్స్! వారు జర భద్రం..

5 నిమిషాల పఠనం

Zodiac Predictions: మరో యాభై రోజుల్లో ఈ సంవత్సరం ముగియనుంది. అయితే గ్రహాల కదలికల ప్రకారం ఈ మిగిలిన సమయం కొన్ని రాశుల వారికి తీవ్ర గడ్డుకాలంగా మారబోతోంది. వివాదాలు, ఆస్తి తగాదాలు, శత్రుత్వాలు, కోర్టు కేసులను సూచించే 'షష్ట స్థానం' (6వ ఇల్లు), ఆ స్థానాధిపతుల గోచార ప్రభావం ఏమాత్రం అనుకూలంగా లేదు.

Zodiac Predictions: మరో యాభై రోజుల్లో ఈ సంవత్సరం ముగియనుంది. అయితే గ్రహాల కదలికల ప్రకారం ఈ మిగిలిన సమయం కొన్ని రాశుల వారికి తీవ్ర గడ్డుకాలంగా మారబోతోంది. వివాదాలు, ఆస్తి తగాదాలు, శత్రుత్వాలు, కోర్టు కేసులను సూచించే 'షష్ట స్థానం' (6వ ఇల్లు), ఆ స్థానాధిపతుల గోచార ప్రభావం ఏమాత్రం అనుకూలంగా లేదు. దీనివల్ల ఆరు రాశుల జాతకులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆ 6 రాశుల వారు ఎవరంటే ?

1. మేషం (భార్యాభర్తల మధ్య గొడవలు): షష్టాధిపతి బుధుడు సప్తమంలో సంచరిస్తున్నందువల్ల డిసెంబర్ 2 వరకు దాంపత్య జీవితంలో తీవ్ర మనస్పర్థలు వచ్చే సూచనలున్నాయి. బంధువుల జోక్యంతో చినికి చినికి గాలివానలా మారే ప్రమాదం ఉంది. వ్యాపార భాగస్వాములతో మాటపట్టింపుల వల్ల పనులు మందగిస్తాయి.

2. మిథునం (ఆస్తి తగాదాలు.. మోసాలు): కుజుడి సంచారం తృతీయంలో ఉండటంతో తోబుట్టువులతో, బంధువులతో ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశముంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ఆచితూచి వ్యవహరించాలి. నమ్మిన స్నేహితుల చేతిలోనే ఆర్థికంగా మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

3. సింహం (తీవ్ర ఆర్థిక సంక్షోభం): షష్టాధిపతి శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏడాది ముగిసేవరకు చేతిలో చిల్లిగవ్వ నిలవని పరిస్థితులు ఎదురుకావచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. ఎవరికీ పూచీకత్తు ఉండకూడదు, అప్పులు ఇవ్వకూడదు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మేలు.

4. కన్య (ఆఫీస్ పాలిటిక్స్.. కోర్టు కేసులు): శనీశ్వరుడి దృష్టి సప్తమం నుంచి పడుతుండటంతో ఆస్తి వివాదాలు ముదిరి కోర్టుల పాలయ్యే ప్రమాదముంది. గతంలో మీరు సాయం చేసినవారే ఇప్పుడు మొహం చాటేస్తారు. ఉద్యోగంలో పైఅధికారుల వేధింపులు, పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన తీవ్రమవుతుంది.

5. ధనుస్సు (స్నేహితులు దూరమయ్యే ప్రమాదం): శుక్రుడు దశమంలో సంచరించడం వల్ల ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసే కుట్రలు జరగవచ్చు. రావాల్సిన బాకీలు చేతికి అందవు. అపార్థాల కారణంగా ప్రాణస్నేహితులు సైతం దూరమయ్యే ముప్పుంది.

6. మీనం (ప్రభుత్వంతో, అధికారులతో ఘర్షణలు): షష్టాధిపతి రవి అష్టమంలో నీచపడటం, గురు బలం తగ్గడంతో పాటు ఏలిన్నాటి శని నడుస్తోంది. పోలీస్, రెవెన్యూ లేదా రాజకీయ నాయకులతో అనవసర తగాదాలు తలెత్తే అవకాశముంది. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాలకు దారితీస్తాయి.

ఈ దోషాల నుంచి గట్టెక్కేందుకు పరిహారం:

ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ఆరు రాశుల వారు గ్రహ దోషాల తీవ్రత తగ్గి ప్రశాంతత లభించాలంటే రోజూ నియమ నిష్టలతో ‘శ్రీ కాలభైరవాష్టకం’ పఠించడం అత్యంత శ్రేయస్కరం. వచ్చే 50 రోజుల పాటు ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో సంయమనం పాటిస్తే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

#Zodiac Predictions#Horoscope 2026#Astrology Predictions#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి