సినిమా

Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Vishwambhara: విశ్వంభర..ఎప్పటి నుంచో నానుతున్న సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఇంకా ఈ సినిమాను గుర్తు పెట్టుకున్నారు. లేదంటే, అసలు ఈ పేరుతో సినిమా అనేది ఒకటుందా? అనే సందేహాలు అందరికీ కలుగుతాయి. ఆ విధంగా తయారైంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి. బింబిసార లాంటి ఘన విజయాన్ని అందుకున్న మల్లిడి వశిష్టకి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్.

కాని, వశిష్ట దాన్ని వాడుకోవడంలో సఫలమయ్యాడా..విఫలమయ్యాడా అంటే ఎటూ చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా కంటే ముందే మొదలైన సినిమాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి, వాటిలో మన శంకరవప్రసాద్‌గారు ఒకటి. ఇక, బాబీ-చిరు కాంబోలో రూపొందుతున్న కాకా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తోంది.

కానీ, ఇంకా..విశ్వంభర సినిమా అప్‌డేట్..అదే రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ, తాజా సమాచారం మేరకు..ఈ సినిమాకి సంబందించి కొంత రీషూట్ చేయాల్సి ఉండటంతో దర్శకుడు వశిష్ట అభ్యర్థన మేరకు చిరు 4 రోజుల పాటు డేట్స్ ఇచ్చారట. ఈ నాలుగు రోజుల్లోనే పెండింగ్ ఉన్న సీన్స్ కంప్లీట్ చేసుకోవాలి వశిష్ట. అయితే, ఈ రీషూట్ విషయం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

కాకపోతే, ఉన్న రష్ ని సరిపెట్టాలనుకున్నారట. తప్పని పరిస్థితుల్లో చిరుతోనే 4 రోజులు రీషూట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఇప్పుడు ఈ సినిమా ఉన్న స్టేజ్‌ని బట్టి చూస్తే దీపావళి లేదా క్రిస్మస్ కి వస్తుందని ఆశించవచ్చు. లేదంటే ఇక, నెక్స్ట్ ఇయర్ సోలో డేట్ దొరికితే ఆ డేట్‌ని లాక్ చేసుకోవచ్చు. చూడాలి, విశ్వంభర రిలీజ్ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో.

#vishwambhara#vishwambhara re shoot#chiranjeevi#mallidi vashistha#trisha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి