Tollywood: హీరో మాత్రమే సినిమాలు చెయ్యాలా..దర్శకుడు హీరో కాకూడదా? సంగీత దర్శకుడు హీరో కాకూడదా? ఈ ప్రశ్న తలెత్తితే..నిజమే కదా..టాలెంట్ ఉంటే ఎవరు ఎలాంటి విభాగంలోనైనా సత్తా చాటొచ్చు. కానీ, నటనపై ఆసక్తి ఉండటంతో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న విభాగం నుంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇది, ఎంత వరకూ కరెక్ట్..సినీ ప్రముఖులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఆర్పీ పట్నాయక్ అవకాశాలు కోల్పోయారా?
ఆర్పీ పట్నాయక్ అంటే సంగీత ప్రియులకి ఎంతో ఇష్టం. ఆయన పాటలు ఆబాలగోపాలాన్ని ఒక ఊపు ఊపేశాయి. యూత్ ఆడియన్స్ కి మంచి టానిక్ లాంటి పాటలిచ్చారు. దర్శకుడు తేజ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆర్పీ ఫిక్స్. అలా, వీరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అంతేకాదు, ఇతర దర్శకుల సినిమాలకి ఆర్పీ సంగీతం అందించాడు. ఒకదశలో ఆయన పాటలు తప్ప ఏవీ వినిపించలేదు. కానీ, ఎప్పుడైతే పట్నాయక్ స్క్రీన్ మీదకి వచ్చారో ఆటోమెటిక్‌గా మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ తప్పింది.
పూర్తి స్థాయిలో నటుడిగా కొనసాగలేకపోయారు. దర్శకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. నటుడైతే, సంగీత దర్శకుడిగా సినిమాలు చెయ్యకూడదా..? అసలు ఎందుకిలా ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఆర్పీ చేసిన సినిమాలన్నిటికీ మ్యూజికల్‌గా సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చారు. అయినా, పట్నాయక్ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని బయటకి అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు.
రాక్ స్టార్ హీరో కాకూడదా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీప్రసాద్‌కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే సినిమాపై అంచనాలు పెరిగిన రోజులున్నాయి. ఇండస్ట్రీని తన మ్యూజిక్‌తో ఒక ఊపు ఊపాడు. అయితే, మధ్యలో చిన్న చిన్న వివాదాలు తలెత్తాయి. బిజీగా ఉన్నా కూడా వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. కానీ, ఎల్లమ్మ సినిమా ఆయనను సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి దూరం చేస్తుందా? అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం, డీఎస్పీ ఆయన నటిస్తున్న ఎల్లమ్మ సినిమాతో పాటు..నాగార్జున నటిస్తున్న కింగ్ 100కి సంగీతం అందిస్తున్నాడు. ఇవి, కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. మరి, పట్నాయక్..డీఎస్పీలపై ఎందుకింత వివక్షత చూపుతున్నారు అర్థం కావడం లేదు.


