Tollywood: వరుస ఫ్లాపుల్లో కూరుకుపోతున్న రష్మిక మందన్న మళ్ళీ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఉన్న అవకాశం మైసా మాత్రమే కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్లోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలోనూ వరుస విజయాలతో దూసుకుపోయిన రష్మిక మందన్నకు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా? నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు ఏమాత్రం తగ్గకపోయినా, సినిమాల ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదనే చర్చ జరుగుతోంది.
భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మునపటిలా సత్తా చాటడం లేదు. రష్మిక విజయాల పరంపరకు బ్రేక్ పడిందా? అంటూ అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో కొత్తగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రష్మిక కెరీర్‌ను పరిశీలిస్తే అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప, 'పుష్ప 2', 'యానిమల్', 'ఛావా' వంటి సినిమాలు ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని తీసుకొచ్చాయి. అయితే, ఆ విజయాల తర్వాత వచ్చిన ప్రతి సినిమా అదే స్థాయి ఫలితాన్ని అందించలేకపోయింది.
సల్మాన్ ఖాన్‌తో నటించిన 'సికందర్' బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే, హిందీలో వచ్చిన మరో సినిమా థామా కూడా ఫ్లాప్‌గా మిగిలింది. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో చేసిన 'కుబేర' కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. రాహుల్ రవీంద్రన్ రూపొందించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ, కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక హిందీలో వచ్చిన 'కాక్టెయిల్ 2' కూడా అంచనాలను తలకిందులు చేసింది.
రణబాలి కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లోనే?
భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'రణబాలి'పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, థియేటర్లలో ప్రారంభమైన జోరును చివరి వరకు కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా 3వ వారానికి వసూళ్లు భారీగా తగ్గడం ఎవరూ ఊహించనిది. టాక్సీవాలా సినిమాతో విజయ్‌కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్..రణబాలి సినిమాతో మాత్రం ఫ్లాప్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రభావం అటు విజయ్ ఇటు రష్మికలపై గట్టిగానే పడింది. ఈ నేపథ్యంలో, రష్మిక మందన్న ఆశలన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మైసా సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలి. లేదంటే..ఇప్పటికే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది..ఇంకా కిందకి పడిపోవాల్సి వస్తుంది.


