సినిమా

Tollywood: నాని 'ప్యారడైజ్' యూనిట్‌పై బాబు మొహన్ ఫైర్..

4 నిమిషాల పఠనం

Tollywood: నాని ప్యారడైజ్ యూనిట్‌పై బాబు మొహన్ ఫైర్..అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరలవుతున్నాయి. ఆయనను, దర్శకుడు లుక్ టెస్ట్ కోసం పిలిచి..మూడు నాలుగు రకాల కాస్ట్యూంస్ వేసి పెద్ద గాజు కన్ను పెట్టి లుక్ చేశారట. కానీ, సినిమాలో మాత్రం వేషం ఇవ్వలేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. బాబు మోహన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బాబు మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం ముందుగా ఆయనను సంప్రదించిందట. అంతేకాదు, ఆయనకు ప్రత్యేకంగా లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్టుగా చెప్పుకొచ్చారు. పాత్ర కోసం పెద్ద గాజు కన్ను పెట్టి, ఐదారు రకాల దుస్తులు వేసి గెటప్‌లు పరీక్షించారని ఆయన వెల్లడించారు.

ఆ గెటప్ బాగుందని చెప్పి, షూటింగ్ సమయంలో పిలుస్తామని పంపించారట. అయితే, ఆ తర్వాత చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బాబు మోహన్ తెలిపారు. తీరా చూస్తే షూటింగ్ పూర్తయి సినిమా విడుదలైపోయిందని తన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం, ఈ సినిమాలో మీ పాత్ర లేదని..అది వేరే వాళ్ళకి చెప్పామని..కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదని..ఇదసలు పద్ధతేనా? అంటూ మేకర్స్ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు బాబూ మోహన్.

దరిద్రం వెంటపడితే సినిమాకి ఇలాగే జరుగుతుంది!

ఈ ఘటనపై బాబు మోహన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను సినిమాలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నప్పుడు కనీసం ఆ విషయం చెప్పాల్సిన బాధ్యత చిత్ర బృందానికి లేదా? అని ప్రశ్నించారు. తనకంటే మంచి నటులు దొరికి ఉంటారని, అందుకే తనను పక్కన పెట్టి ఉంటారని వ్యంగాస్త్రాలు విసిరారు.

అంతేకాదు, తనను లక్కీ హ్యాండ్‌గా అభివర్ణించుకుంటూ గతంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమాల ఉదాహరణను కూడా ప్రస్తావించారు. ‘చెవిలో పువ్వు’ సినిమాలో తాను లేకపోవడంతో అది ఫ్లాప్ అయిందని, ఆ తర్వాత ‘ప్రేమఖైదీ’లో నటించడంతో సినిమా విజయవంతమైందని గుర్తుచేశారు. ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ తనను పక్కన పెట్టినందుకే దరిద్రం, శని వెంటపడ్డాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తానికి, బాబూ మోహన్ మాటలు అంతటా చర్చకు దారితీశాయి. మరి, ఈ వ్యవహారంపై నాని గానీ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గానీ ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

#Babu Mohan#The Paradise#Nani#Srikanth Odela#Tollywod
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి