సినిమా

Kollywood: వివాహబంధంలోకి "ఇరుముడి" హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై!

4 నిమిషాల పఠనం

Kollywood: వివాహబంధంలోకి ఇరుముడి హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా? ప్రస్తుతం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతోంది. తాజాగా, క్రేజీ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ పెళ్ళి చేసుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలోనే సమంత..రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, నయనతారల మాదిరిగా పెళ్ళి చేసుకొని హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఆ లిస్ట్‌లో ఇరుముడి మూవీతో టాలీవుడ్‌లో బాగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియ భవానీ శంకర్ కూడా చేరారు.

అయితే, ప్రియ పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తుందా? కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తుందా.! అనేది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. ఇప్పుడిప్పుడే, ఈ బ్యూటీకి సౌత్‌లో మంచి క్రేజ్..ప్రేక్షకుల్లో ఆదరణ ఏర్పడింది. ఇటీవల, మన మాస్ మాహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

ఇంతలోనే, ప్రియా భవానీ శంకర్ తన చిన్ననాటి ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. చెన్నైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కాలేజీ రోజుల నుంచి పరిచయమైన వీరిద్దరూ దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. చివరకు తమ ప్రేమను పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మంచి ఊపందుకుంటున్న సమయంలో ఇలా పెళ్లి చేసుకోవడం అంటే ..సినీ కెరీర్‌కి కాస్త అడ్డంకి కలిగినట్టే. అయితే, కీర్తి సురేష్ మాదిరిగా పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేయడానికి భర్త ఒప్పుకుంటే ఏ ఇబ్బంది ఉండదు.

ఇక, ప్రియ భవానీ సినిమాల విషయానికొస్తే.. ‘డిమాంటీ కాలనీ 3’, ‘మరగధ నాణయం 2’, ‘ఇండియన్ 3’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాల తర్వాత మరి కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటుందా లేదా అన్నది త్వరలో తెలియనుంది. ప్రస్తుతానికైతే..వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ కొత్త జంట..కొంతకాలం హనీమూన్ వంటి ప్రోగ్రాంస్‌తో బిజీగా ఉండబోతున్నారు.

#Rajvel Raj#Priya Bhavani Shankar#South Actress Priya Bhavani hankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి