సినిమా

Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా!

4 నిమిషాల పఠనం

Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా! అంటూ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటి వరకూ బాలయ్య వారసులు ఎవరూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. బాలయ్య నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గత నాలుగైదేళ్ళుగా టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ, చాలా ఆలస్యంగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది.

ఇదే, సమయంలో బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని నిర్మాతగా పగ్గాలు చేతిలోకి తీసుకోనున్నట్టు తాజా సమాచారం. ఆ మధ్య తేజస్విని డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియో అంతటా తెగ వైరల్ అయింది. అంతేకాదు, తేజస్వినీ హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని నితిన్ సోదరి దర్శకత్వం వహించబోతున్నట్టుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే, ఇంతలోనే నందమూరి వారసురాలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోందని తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు సినిమా నిర్మాత భువన్ ఈ మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్నారట. తేజస్విని ఈ మూవీని నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. కాలేజీ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌ను తేజస్వినికి భువన్ చెప్పగా, అది నచ్చి స్వయంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే, తేజస్విని..బాలయ్య చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే, బాలయ్య నటించిన భగవంత్ కేసరి, అఖండ 2 సినిమాలకి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. కాబట్టి, తేజస్వినికి నిర్మాతగా సినిమా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి, ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. అలాగే, ఆమె హీరోయిన్‌గా కూడా సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఘంటా దీప్తి దర్శకరురాలిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.

#Nandamuri Tejaswini#Nandamuri Balakrishna#Tollywood#Tejaswini
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి