తెలంగాణ

TG : రాష్ట్రంలో విషాదం.. ఒకే రోజు ముగ్గురు రైతుల బలవన్మరణం

5 నిమిషాల పఠనం

తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాలు లేక సాగు దిగుబడి రాక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరి వేసిన రైతులు అయితే సాగుకు నీళ్లు అందించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తెలంగాణ సర్కార్ ముందే చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉన్నది.

తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాలు లేక సాగు దిగుబడి రాక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరి వేసిన రైతులు అయితే సాగుకు నీళ్లు అందించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తెలంగాణ సర్కార్ ముందే చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉన్నది. కోత దశకు వచ్చిన పంట ఎండిపోయే స్థితిలో దర్శనమిస్తుండటంతో ఎలాగైనా కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పొలాలు తడుపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పెట్టుబడి భారం కావడం, పాత అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధర రాక, మధ్యలో దళారుల దోపిడీ వంటి అంశాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఈ క్రమంలోనే అప్పుల భారం భరించలేక, పంట దిగుబడి రాలేదని ఆవేదనతో రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన తీవ్రవిషాదం నింపింది.

TG :  రాష్ట్రంలో విషాదం..  ఒకే రోజు ముగ్గురు రైతుల బలవన్మరణం

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుజ్జు తండాలో తనకున్న రెండెకరాల భూమిలో పత్తి సాగు చేయగా దిగుబడి రాకపోవడంతో వ్యవసాయ బావిలో దూకి జర్పుల వెంకటేష్ (27) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో పత్తి సాగులో నష్టం రావడంతో మెట్ల ఉప్పలమ్మ (50) అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

TG :  రాష్ట్రంలో విషాదం..  ఒకే రోజు ముగ్గురు రైతుల బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండా పరిధిలోని వెంకట్రామ్ తండాలో తనకున్న రెండెకరాల భూమిలో వరి, మొక్కజొన్న సాగు చేయగా, ఆశించిన స్థాయిలో దిగుబడి రాక అప్పులు పెరగడంతో బానోతు రాములు (58) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే, రాష్ట్రంలో వరుసగా అన్నదాతలు ఆత్మహత్మలకు పాల్పడుంటే సర్కార్ స్పందించకపోవడం తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. రైతుల మరణాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నా సంబంధిత వ్యవసాయ మంత్రితో పాటు ఇతర మంత్రులు ఎవరూ స్పందించకపోవడం ప్రభుత్వం తీరుకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా కరెంటు సరఫరా చేయక, సరిపడా నీళ్లు ఇవ్వకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతులకు సాగు నీరు ఇవ్వలేమని సర్కార్ ఇప్పటికే ప్రకటించడం, పల్లెల్లో పదే పదే కరెంటు కోతలు విధిస్తుండటంతో పొలాలకు నీరు పారించలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు నీరు లేకపోయినా బావుల్లో నుంచి జనరేటర్ల ద్వారా అన్నదాతలు నీటిని పారిస్తున్నారు. కరెంటు లేకపోవడంతో వారిపై మరింత భారం పడుతోందని, ఆ అప్పులు తీర్చలేక, దిగుబడి రాక బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

#Farmers#suicides#telangana#debts#no water#croploss#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి