స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

VCSajjanarControversy: చాటుమాటున సజ్జనార్ ఆగడాలు ఎన్నో?

8 నిమిషాల పఠనం

‘‘సత్యాలే వార్తలు’’. ఇది స్వేచ్ఛ న్యూస్ ట్యాగ్ లైన్. ఇప్పటికే ఎన్నో స్కాంలను బయట పెట్టినా ఉప్పులా అందరికీ చేయి అందించిన చరిత్రే తప్ప ఏనాడూ తప్పు చేయలేదు. మంచి పోలీస్, రెవెన్యూ వ్యవస్థ కోసం ఎన్ని పాట్లైనా పడేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిత్వం నాది. అలాంటిది ఓ నిజాయితీ ఆఫీసర్‌గా సోషల్ మీడియాలో పేరుండి, తెర వెనుక అవినీతికి పాల్పడితే ఎలా ఊపేక్షిస్తాను. మీ అవసరాల కోసం చేసుకోండి అస్సలు పట్టించుకోం.

  • అందుకే ఎన్ని పవర్స్ ఉపయోగించినా బదిలీ తప్పలే?

  • స్వేచ్ఛ న్యూస్‌కు నోటీసులు ఇవ్వండి

  • ఆధారాలతో బయటపెడుతాం

  • ఎన్‌కౌంటర్స్ చేసినంత ఈజీగా మీ డ్యూటీ మీరు ఎందుకు చేయలేదు?

  • మీ సీసీ ఒక్కొక్క ట్రాన్స్‌ఫర్స్‌కు ఎవరి వద్ద ఎన్ని లక్షలు వసూలు చేశారో తెలుసా?

  • మీ బినామీ టీమ్స్‌కు ఎలాంటి పవర్ ఫుల్ పోస్టింగ్స్ ఇచ్చారో గుర్తుందా?

  • సోషల్ మీడియాలో ఆదర్శవంతంగా ఉండే సజ్జనార్‌కు స్వేచ్ఛ న్యూస్ సవాల్

  • నిరూపించుకునే దమ్ము మాకుంది సార్

  • లేదంటే చేసిన ఎన్నో ఫేక్ ఎన్‌కౌంటర్లలా నన్ను కూడా చంపండి

  • హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను మీ చేతిలో పెడితే మీరు చేసింది ఏంటో సీఎంకు తెలియకుండా ఉంటుందా?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్చ న్యూస్ ఛైర్మన్.

‘‘సత్యాలే వార్తలు’’. ఇది స్వేచ్ఛ న్యూస్ ట్యాగ్ లైన్. ఇప్పటికే ఎన్నో స్కాంలను బయట పెట్టినా ఉప్పులా అందరికీ చేయి అందించిన చరిత్రే తప్ప ఏనాడూ తప్పు చేయలేదు. మంచి పోలీస్, రెవెన్యూ వ్యవస్థ కోసం ఎన్ని పాట్లైనా పడేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిత్వం నాది. అలాంటిది ఓ నిజాయితీ ఆఫీసర్‌గా సోషల్ మీడియాలో పేరుండి, తెర వెనుక అవినీతికి పాల్పడితే ఎలా ఊపేక్షిస్తాను. మీ అవసరాల కోసం చేసుకోండి అస్సలు పట్టించుకోం. కానీ, మీ అసలు రూపం మరో వంద మంది ముందు చూపిస్తే ఒక్కరు నాలాంటి వాళ్లకు చేరవేసినా, మీలాంటి ఉన్నతాధికారులపై అంటే సీఎస్, డీజీలతో పాటు అందరిపై మా లాంటి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఒక వార్త రాయాలనే తపన ఉంటుంది. అందుకే మీకు వ్యక్తిగా సవాల్ విసురుతున్నా. వ్యవస్థగా చాలా ఆధారాలు ఉన్నాయి.

ఎంతో గుర్తింపు ఉన్న బాస్?

సజ్జనార్ ఎక్కడ డ్యూటీ చేసినా ఆయన పవర్ సెంటర్‌ను, ప్రచారాన్ని మీడియాతో వాడుకుంటారు. దీంతో పొలిటికల్ పరిచయాలు ఎన్నో. ఎస్ఐబీలో చేసినా, డీజీగా చేసినా లీకులు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి పొలిటికల్‌గా ఎంతో పేరుగాంచారు. సైబరాబాద్ సీపీగా పనిచేసన సమయంలోనే పెద్ద మొత్తంలో కొల్లగొట్టారని టాక్. అయినా ఎవ్వరి నుంచి ఆనాడు బయటకు పొక్కలేదు. ‘దిశ’ ఘటనలో ఎన్‌కౌంటర్ చేసినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. కానీ, అదే ఒక సీఐ.. మహిళను వేధించి వెంటాడి కోట్ల రూపాయలు దోచిపెడితే, పోస్టింగ్ ఇవ్వొద్దని మెర పెట్టుకున్నా 25 లక్షలు సీసీ శ్రీధర్‌కు చేరవేస్తే జూబ్లీహిల్స్ పోస్టింగ్ ఇచ్చారే. అదే మీ అక్రమాలకు, అవినీతికి నిదర్శనం. ఎలాంటి ఆధారాలైనా ఈ బదిలీకి కారణంగా మారాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిభట్ల సీఐకి మీకు ఉన్న సంబంధం.. బంజారాహిల్స్ సీఐకి మీకు ఉన్న అనుబంధం.. ఒక్క వీడియో కాన్ఫరెన్స్‌లో మీరు మీ అనుకూలంగా ఉన్న సిబ్బందికి మీకు అనుకూలంగా లేని వారికి ఎలా వ్యవహరించారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సార్. ఎవ్వరి కోసం హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను మీ చేతిలో పెట్టారో సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? దేశంలో అత్యధిక పొలిటికల్ పవర్ ఉన్న ఐపీఎస్‌గా చాలామందికి తెలుసు. అయినా ఎన్ని ఆధారాలు ఉంటే మిమ్మల్ని పక్కకు జరపాల్సి వచ్చిందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఐపీఎస్‌లే ఇలా ఉంటే కానిస్టేబుల్ ఎలా ఉంటాడో?

ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల అవినీతిపై ఆరోపణ చేసినా నిరూపించాలంటే ఎంతో కష్టం. గతంలో కేసుల్లో ఇరుక్కున్న బ్యూరోక్రాట్స్‌కు తెలుసు. కానీ, ఇప్పుడు డీవోపీటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఈడీ, సీబీఐ లాంటి కేసులు అయితే కానీ వీళ్ల వ్యవహారం బయటకు పొక్కదు. లోలోపల ఎన్ని దందాలు చేసినా, ఎలాంటి వ్యవహారాలతో చక్కదిద్దుకున్నా ప్రజలకు వార్తల రూపంలో పేరు లేకుండా రాస్తే పట్టించుకోలేని పరిస్థితి. ‘మా బాస్‌యే పెద్ద అదట..’ అని తెలుసుకున్న వాళ్లు కింది స్థాయిలో ఎలా ఉంటారో అర్థం అవుతోంది. అలానే ఈనాటి పోలీస్ వ్యవస్థ మారింది. నిజాయితీగా ఉండే ఒక ఏకే మహంతిలా, కనీసం వాళ్ల పిల్లల్లా సీనియర్ ఆఫీసర్స్‌గా మీకు పేరుండేది. ఇలా చిటికన వేలుతో లెక్క పెట్టేంత మంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఉండడం దురదృష్టంగా మారింది. అందుకే కింది స్థాయి వాళ్లు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు.

నన్నుకూడా చంపేయండి?

సమాజంలో మీకున్న పేరుకు, మీరు చేస్తున్న వ్యవహారానికి తేడా ఏంటో నేను నిరూపించేందుకు రెడీగా ఉన్నాను. లేదంటే ‘దిశ’ ఎన్‌కౌంటర్‌లో నిందితుల్లా నన్ను కూడా చంపేయండి. ఆధారాలతో నేను 20ఏండ్ల క్రైం, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా వస్తాను. మీరు కూడా రండి. ఆడపిల్లకు అన్యాయం జరిగిందని వస్తే.. ‘సెటిల్మెంట్ చేసుకో పో..’ అనే సీపీ ఉంటే ఎంత? ఊడితే ఎంత? అదే బంజారాహిల్స్‌లో సీఐ ఆగడాలపై వార్తలు రాసి సర్వీస్ రిమూవల్ చేయించానని చెబుతాను. కోర్టులో కూడా ఆ ఆడబిడ్డ కోసం ఫైట్ చేయించాను. అదే సీపీగా మీరు ఏం చేశారు సార్. ఆనాడు దిశ అని పెద్దగా పేరు తెచ్చుకున్నారు. ఈనాడు ఒక్క సీఐని కాపాడేందుకు ఎన్ని వేషాలు వేశారో ఎన్నో ఉదాహరణలు, ఎంతమంది సీఐలు , కర్ణాటక బ్యాచ్ వాళ్లు వాళ్ల ఆస్తులు ఏంటో తేల్చుకునేందుకు అన్ని బ్లాక్ అండ్ వైట్‌గా ఫైట్ చేస్తాను. నిరూపించకపోతే చంపేయండి సజ్జనార్.

నెక్స్ట్ స్టోరీ..

విచారణ చేపట్టిన కేసుల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది? చార్జిషీట్లలో ఏం దాఖలు చేశారు? తప్పులను కప్పిపుచ్చుతే ఎంత? తప్పిస్తే ఎంత? నడిరోడ్డుపై దారుణం జరిగినా జరగాల్సిన న్యాయం జరగకపోతే ఎలా? ట్యాపింగ్ కేసుల్లో ఇచ్చిన ఫిర్యాదులన్నీ ఎమయ్యాయో తెలుసా? ఫైనల్ ఛార్జిషీట్‌లో ఎందుకంత ఆలస్యం అనేది మరో కథనంలో చూద్దాం.

#VCSajjanarControversy2026#DevenderReddySwatantraNews#Sajjanar#HyderabadPoliceCommissionerTransfersAllegations#DishaEncounterSajjanarDebate#TeluguMediaNewsTelugu#HydNewsTelugu#TelanganaPoliticsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి