ఆధ్యాత్మికత

December Horoscope: డిసెంబర్ నెలలో ఆ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. వాళ్లకు అదృష్టం మామూలుగా లేదు!

4 నిమిషాల పఠనం

December Horoscope: డిసెంబర్ నెల సమీపిస్తున్న వేళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోబోతోంది. ఏడాది చివర్లో గ్రహాల అనుకూలత వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావడం, ఆకస్మిక ధనలాభం కలగడంతో పాటు ఉద్యోగం, వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో ఎదుగుదల కనిపించబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనస్సు రాశి:

ఈ డిసెంబర్ నెల ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని ఎప్పటినుంచో కలలు కంటున్న వారి కోరిక ఈ నెలలో నెరవేరే అవకాశం ఉంది. సొంత ఇల్లు లేదా కొత్త వెహికిల్ కొనుగోలు చేసే యోగం బలంగా కనిపిస్తోంది. ఆర్థికంగా చూస్తే లాటరీ లేదా ఆకస్మిక ధనలాభం కలిసివచ్చే ఛాన్స్ ఉంది. కుటుంబంలోనూ సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఈ నెల అన్ని విధాలా అద్భుతంగా కలిసిరానుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు, ఆగిపోయిన బాకీలు తిరిగి చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే శుభవార్త వింటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త డీల్స్ కుదురుతాయి. వీటితో పాటు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి :

ఇన్నాళ్లూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి దక్కబోతోంది. పాత అప్పులన్నీ తీరిపోయి, చేతిలో డబ్బు నిలబడుతుంది. ఆఫీసులో మీ పనికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కడంతో పాటు కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తారు. ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసుల విషయంలోనూ మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తుల రాశి :

తుల రాశి వారు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక తీపి కబురును ఈ నెలలో వినబోతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్ లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ప్రేమ, పెళ్లి విషయాల్లోనూ సానుకూల వాతావరణం ఉంటుంది. మొత్తంగా ఈ నెలలో తుల రాశి వారు ఆర్థికంగా మరింత బలపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

#December Horoscope#December 2026 Horoscope#Lucky Zodiac Signs#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి