జాతీయం

Sabarimala Special Trains: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఏకంగా 54 స్పెషల్ ట్రైన్స్.. తేదీలు ఇవే!

6 నిమిషాల పఠనం

Sabarimala Special Trains: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వాములు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏకంగా 54 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

Sabarimala Special Trains: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వాములు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏకంగా 54 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ స్పెషల్ ట్రైన్లు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ - కొల్లం - హైదరాబాద్ మధ్య నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మొత్తంగా ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇందులో 07193 నంబర్ రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (శనివారం) రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి, సోమవారం ఉదయం 7.15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, 07194 రైలు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో (సోమవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య నల్గొండ, మిర్యాలగూడ మార్గంలో 12 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 07180 నంబర్ రైలు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (శుక్రవారం) రాత్రి 11.45 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, ఆదివారం ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 07181 రైలు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ఆదివారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నల్గొండ, మిర్యాలగూడ రూట్‌లోనే చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య మరో 18 సర్వీసులను కూడా నడపనున్నారు. 07195 రైలు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో (ఆదివారం) రాత్రి 11.45 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మంగళవారం ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకోనుంది. అలాగే, 07196 ప్రత్యేక రైలు నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో (మంగళవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఇదే నల్గొండ, మిర్యాలగూడ మీదుగా చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య అదనంగా మరో 8 స్పెషల్ సర్వీసులు నడుస్తాయి. ఇందులో 07197 రైలు డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో (బుధవారం) రాత్రి 11.45 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 07198 ప్రత్యేక రైలు డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

మరోవైపు వరంగల్, కాజీపేట ప్రాంత భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య కాజీపేట మీదుగా ఆరు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. 07199 రైలు డిసెంబర్ 30, జనవరి 6, 13 తేదీల్లో (బుధవారం) రాత్రి 10.40 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకోనుంది. అలాగే, 07200 ప్రత్యేక రైలు జనవరి 1, 8, 15 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది.

వీటితో పాటు నాందేడ్ - కొల్లం మధ్య కూడా ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. 07189 నంబర్ రైలు ఈ నెల (నవంబర్) 15న సాయంత్రం 5.15 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి, మంగళవారం ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, 07190 కొల్లం - చర్లపల్లి ప్రత్యేక రైలు నవంబర్ 17న ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఒకట్రెండు రైళ్లలో కేవలం ఏసీ బోగీలు మాత్రమే ఉండగా.. మెజారిటీ రైళ్లలో ఏసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. సామాన్య భక్తులకు సైతం ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడనున్నాయి కాబట్టి, శబరిమల యాత్రకు ప్లాన్ చేసుకునే భక్తులు ఈ తేదీలను గమనించి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

#Sabarimala Special Trains#Sabarimala 2026#Ayyappa Swamy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి