Tollywood: దిగ్గజ ఓటీ కోసం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మెగావర్స్’ మెగా టాక్ షోపై రోజురోజుకూ అంచనాలు, ఆసక్తి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోకు టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు భాగం కానున్నారు. ఇప్పటికే, బ్రహ్మానందం, అక్కినేని హీరోతో పాటు పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకే ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం, ప్రభాస్-సందీప్ ‘స్పిరిట్’ సినిమా కోసం కలిసి పనిచేస్తుండటంతో ఈ ఎపిసోడ్‌పై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ప్రభాస్ స్టార్‌డమ్.. మరోవైపు సందీప్ రెడ్డి వంగా మాస్ అటిట్యూడ్.. వీరిద్దరితో మెగాస్టార్ చిరంజీవి చేసే డిస్కర్చన్ ఎలా ఉండబోతుందోననే క్యూరియాసిటీ డార్లింగ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్‌లో పెరుగుతోంది.
నవంబర్ 20న ప్రత్యేక ఎపిసోడ్?
ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ నవంబర్ 20వ తేదీన ప్రభాస్‌కు సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో సందీప్ రెడ్డి వంగా కూడా జాయిన్ కానున్నారని సమాచారం. అయితే, ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించలేదు. తెలుగులో, ఆహా కోసం నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షోను అద్భుతంగా నడిపించారు. ఇంతకు నాలుగింతలు హై ఓల్టేజ్‌తో మెగాస్టార్ హోస్ట్ చేయనున్న మెగావర్స్ డిజైన్ చేశారట.
స్పిరిట్ విశేషాలు బయటకు వస్తాయా?
ఇప్పటి వరకు స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ తో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రీ లుక్ మాత్రమే రివీలైంది తప్ప మరే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బయటకి రాలేదు. దీంతో, ప్రస్తుతం ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మెగావర్స్ వేదికగా ఈ ఇద్దరూ పాల్గొంటే సినిమా కథ, ప్రభాస్ పాత్ర, సందీప్ వంగా మేకింగ్ స్టైల్ గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయా అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. చూడాలి, మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎలా ప్లాన్ చేశారో.


