తెలంగాణ

TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యం- కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

7 నిమిషాల పఠనం

టీఆర్ఎస్ చీఫ్ కవితపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. కవిత టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కవిత, ఆమె పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కాదు.. తెలంగాణ రేవంత్ సైన్యం అని ధ్వజమెత్తారు.

RS Praveen Kumar: టీఆర్ఎస్ చీఫ్ కవితపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. కవిత టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కవిత, ఆమె పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కాదు.. తెలంగాణ రేవంత్ సైన్యం అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఇలా అనేక అనుబంధ సంఘాలు ఉంటాయన్న ప్రవీణ్ కుమార్.. TRS కూడా అలాంటి అనుబంధ సంస్థనే అని ఆరోపించారు.

కవిత TRS పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారాయన. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కాదు.. తెలంగాణ రేవంత్ సైన్యం అని విమర్శించారు. కవిత ఎవరి పక్షమో చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. మీరు ఉద్యోగస్తులా పక్షమా? రేవంత్ రెడ్డి పక్షమా? అంటూ కవితను ప్రశ్నించారాయన.

రేవంత్ మీద ఈగ కూడా వాలనివ్వని సైన్యం TRS

''కాంగ్రెస్ పార్టీకి.. యూత్ కాంగ్రెస్‌, మ‌హిళా కాంగ్రెస్, నేష‌న‌ల్ స్టూడెంట్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా (NSUI ) వంటి అనుబంధ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ కూడా వ‌చ్చింది. అదే తెలంగాణ ర‌క్ష‌ణ సేన. తెలంగాణ‌లో రేవంత్ సైన్యం TRS. రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాల‌కుండా కంటికి రెప్ప‌లా కాపాడుతున్న సైన్యం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌.. ఆ పార్టీ నాయ‌కురాలు క‌విత'' అంటూ నిప్పులు చెరిగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

కవిత చదివింది కంప్యూటర్ ఇంజనీరింగ్.. జియాలజిస్ట్ కాదు

తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్, విజిలెన్స్ రిపోర్టులు, నిమ్స్ పెన్షనర్ల లేఖ అంశాలపై కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కవిత టార్గెట్ గా ఎదురుదాడికి దిగారు. మల్లన్న సాగర్ భూకంపం వచ్చే ప్రాంతంలో కట్టారని కవిత చెప్పారు.. ఆమె చదువుకున్నది కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ జియాలజిస్ట్ కాదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ (CWC) అనుమతులు వచ్చిన తర్వాతే మల్లన్న సాగర్ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ భూకంపం వస్తుందని, భూమిని ట్రీట్ చేసి కట్టాలని కవిత అనడాన్ని తప్పుపట్టారాయన. అయినా భూమిని ట్రీట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.

''కవిత ఏమీ ఇరిగేషన్ డిజైనింగ్ లో కూడా ఎక్స్ పర్ట్ కాదు. ఎన్ జీఆర్ పై రిపోర్ట్ తీసుకొచ్చి మల్లన్నసాగర్ లో 1923లో భూకంపం వచ్చిందని చెబుతున్నారు. భూమిని రిపేర్ చేసి కట్టాలని చెబుతున్నారు. అలా రిపేర్ చేసి కట్టేందుకు అదేమైనా రేవంత్ సోదరుల భూమినా? సెంట్రల్ వాటర్ కమిషన్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాతే అక్కడ రిజర్వాయర్ కట్టారు'' అని ప్రవీణ్ కుమార్ వివరించారు.

విజిలెన్స్ రిపోర్టులు కవిత చేతిలోకి ఎలా వచ్చాయి?

తాను.. 26 ఏళ్లు పోలీస్ ఆఫీసర్‌గా పనిచేశానని.. ముఖ్యమంత్రికి మాత్రమే పంపే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్టులు కవిత చేతిలోకి ఎలా వచ్చాయ్? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు రిపోర్టులు కేవలం ముఖ్యమంత్రికే పంపుతారు.. ఎప్పుడూ కూడా పబ్లిష్ చేయరని వెల్లడించారు. అంటే కవితకు రిపోర్టులు రేవంత్ రెడ్డి ఇస్తేనే వచ్చాయా? అనే సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డే స్క్రిప్ట్ ఇచ్చి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్టులు ఇచ్చి కవితను మాట్లాడమని చెప్పారని ఆరోపించారు.

కవిత మరో పచ్చి అబద్ధం చెప్పి దొరికిపోయింది

నిత్యం అబద్ధాలు చెప్పే కవిత మరో పచ్చి అబద్ధం చెప్పి దొరికిపోయిందన్నారు ప్రవీణ్ కుమార్. మాజీమంత్రి హరీశ్ రావు మీద చర్యలు తీసుకోమని NIMS పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తనకు లేఖ రాసినట్టు కవిత ఒక నకిలీ ఉత్తరం చూపించిందన్నారు. అసలు NIMS ఆసుపత్రిలో పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేదే లేదని స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతుందో సీఎం రేవంత్ కి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. సిట్ అధికారుల వద్ద ఉండాల్సిన ఛార్జ్ షీట్ రేవంత్ రెడ్డి దగ్గరకు ఎలా వెళ్లింది? అని అడిగారు. మీరు కావాలనే ఛార్జ్ షీట్‌లో కొందరి పేర్లను చేర్చుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.

#RS Praveen Kumar#Trs#Brs#Congress#Kavitha#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి