Tollywood: శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సంక్రాంతి టార్గెట్ మిస్సయ్యేదే లేదా? అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదనే అర్థమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైనంత త్వరగా, ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమా పూర్తి కాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న సినిమా ఇది. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ధర్మన్, కాకా, సంబరాల యేటిగట్టు, జనవరి 12 విడుదల లాంటి చిత్రాలున్న నేపథ్యంలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’..సంక్రాంతి టార్గెట్ మిస్సవుతుందని ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పుకున్నారు.
కానీ, తాజాగా అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. చిత్ర యూనిట్ ఈ సినిమాను 2027, సంక్రాంతికి తీసుకువచ్చే విధంగానే శరవేగంగా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేస్తోంది. తాజాగా, ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్టుగా నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా ప్రకటించింది. అసలు, ఇంత జెట్ స్పీడ్‌లో జార్జి క్రిష్ ఎలా కంప్లీట్ చేస్తున్నారో అని అందరూ అవాక్కవుతున్నారు.
దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న శ్రీను వైట్ల చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ఈ ‘జార్జ్ క్రిష్’పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడగా.. పక్కా హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే టార్గెట్‌తో శ్రీను వైట్ల రెడీ అవుతున్నాడు.
ఇక, ఈ సినిమాలో శర్వానంద్ జార్జ్, క్రిష్ అనే రెండు విభిన్నమైన పాత్రలలో నటించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బూస్టర్ ద్వారా అర్థమైంది. ఒక పాత్ర క్రిస్టియన్ నేపథ్యంతో ఉంటే, మరో పాత్ర హిందూ సంప్రదాయాలకు సంబంధించిన నేపథ్యంగా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రల మధ్య సంబంధం ఏమిటి? వాటి చుట్టూ ఎలాంటి కామెడీ సన్నివేశాలు ఉంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, హీరోయిన్ ఒక్కరే కాబట్టి కన్‌ఫ్యూజన్ కామెడీ ఉండబోతుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి, శ్రీను వైట్ల సాలీడ్ కంబ్యాక్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. మరి, 2027 సంక్రాంతి బరిలో దిగబోతున్న జార్జి క్రిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


