ఏపీ

AP : 19 నుంచి ఏపీలో మరోసారి ఎన్నికలు : ఈసీ

4 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. శనివారం తిరుపతి కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీలు, పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన పోలీసు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఫలితాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయని చెప్పారు.

తదుపరి దశలో భాగంగా 19న మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ), 20న జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అనంతరం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల డిప్యూటీ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ ఉంటుందన్నారు. గత ఎన్నికల సమయంలో పల్నాడు నుంచి రాయలసీమ వరకు కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్న చెదురుమొదురు ఘర్షణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.

ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సమస్యాత్మక 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎవరైనా భద్రత కోరితే ప్రత్యేక ఎస్కార్ట్‌ను కూడా కల్పిస్తామని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా భరోసా కల్పించారు. ఇదిలాఉండగా,ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. మెజార్టీ స్థానాలను దక్కించుకుని అగ్రస్థానంలో ఉన్నారు. ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికల్లో చతికిలపడింది.

#Andrapradesh#elections#mpp#zp#TDP#janasena#ysrcp#politics#ec anil chandra punetha#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి