తెలంగాణ

BRS : ఇందిరా, రాజీవ్ అని పేర్లు పెడితే చాలదు.. పథకాల అమలేది? : హరీశ్ రావు

4 నిమిషాల పఠనం

ప్రభుత్వ పథకాలకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని పేర్లు పెడితే చాలదని, వాటిని అమలు చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవమని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని పేర్లు పెడితే చాలదని, వాటిని అమలు చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవమని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్.. రేవంత్ సర్కార్ మూడు బడ్జెట్ల వైఫల్యాలపై సమీక్ష నిర్వహించి లెక్క అడగాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.

నిరుపేద కూలీలు,నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. అమలుకు నోచుకోని పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్ గా ఉందని, హామీలు ప్రకటించడం, పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం అని చెప్పారు. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం బాగా అలవాటు అయ్యిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పాత బడ్జెట్ ప్రకటనలనే మళ్లీ మళ్లీ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్స్ కోసం నిరుపేద కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని చెప్పారు. 2024-25 బడ్జెట్‌లో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటన చేశారని.. 2025-26 బడ్జెట్‌లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటికీ మూడు బడ్జెట్లు పూర్తయినా నేటికీ రూ.12 వేల ఆర్థిక సాయం నిరుపేద వ్యవసాయ కూలీలకు అందలేదని హరీశ్ రావు గుర్తుచేశారు.

ఇక ‘రాజీవ్ యువ వికాసం’ కేవలం బడ్జెట్ కాగితాలకే పరిమితం అయిందన్నారు. సొంత మేనిఫెస్టో హామీలను తుంగలో తొక్కడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకుంటుందని అడిగారు. ఇకనైనా రాజకీయ నినాదాలు, ఉపన్యాసాలు పక్కన పెట్టాలని హితవు పలికారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడంతో మీ బాధ్యత తీరిపోదని, అమలు కాని ప్రతి హామీపై రేవంత్ రెడ్డిని నిలదీసి లెక్క అడగాలని రాహుల్ గాంధీని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది జిమ్మిక్కులు కాదు.. సుపరిపాలన! మోసాలు కాదు, హామీల అమలు..పాత హామీల తిరగబోత కాదు..ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి’అని తెలిపారు.

#Congress manifesto#schemes#implimentation#Rahulgandi#cm revanthreddy#harishrao#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి