సినిమా

Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత..

2 నిమిషాల పఠనం

Giribabu: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రియులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు, నటనపై ఉన్న అమితమైన ఇష్టంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, స్వయంకృషితో ఎదుగుతూ తన సుదీర్ఘ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నవరసాలను అలవోకగా పండించగల ఒక గొప్ప కళాకారుడి నిష్క్రమణతో తెలుగు సినీ రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసినట్లయింది. గిరిబాబు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, తోటి నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, గిరిబాబు లేని లోటు టాలీవుడ్‌కు తీరనిదని పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.

#Giribabu#Giribabu Death News#Telugu Actor Giribabu#Senior Actor#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి