సినిమా

Bollywood: డెడ్లీ కాంబో..ఆర్జీవి కథతో మోహిత్ సూరి సినిమా.!

4 నిమిషాల పఠనం

Bollywood: క్రేజీ డెడ్లీ కాంబినేషన్‌గా ఆర్జీ-మోహిత్ సూరిలది నిలవబోతోంది. ఇప్పుడు ఆర్జీవి కథ, మోహిత్ సూరి దర్శకత్వం అనే వార్త బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు సంచలన కథలకు, విభిన్నమైన ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ.. మరోవైపు ప్రేమకథల్లోనూ, ఇంటెన్స్ ఎమోషన్స్‌లోనూ తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి.

Bollywood: ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ అటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ కొన్ని కాంబినేషన్లు వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. అలాంటి క్రేజీ డెడ్లీ కాంబినేషన్‌గా ఆర్జీ-మోహిత్ సూరిలది నిలవబోతోంది. ఇప్పుడు ఆర్జీవి కథ, మోహిత్ సూరి దర్శకత్వం అనే వార్త బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు సంచలన కథలకు, విభిన్నమైన ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ.. మరోవైపు ప్రేమకథల్లోనూ, ఇంటెన్స్ ఎమోషన్స్‌లోనూ తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి. ఈ ఇద్దరి క్రియేటివిటీ కలిస్తే తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో అన్నే చర్చ మొదలైంది.

గ్యాంగ్‌స్టర్ కథలో ఆర్జీవి మార్క్!

ఈ సినిమా కథ ముంబై అండర్‌వరల్డ్‌లో చోటుచేసుకున్న కీలక పరిస్థితుల నేపథ్యంలో సాగనుందట. ముఖ్యంగా, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ మధ్య జరిగిన విభేదాలు, వారి మధ్య గ్యాంగ్‌వార్, 1993 ముంబై పేలుళ్ల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కథలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. సౌత్యా అనే వ్యక్తి కారణంగా ఈ ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైంది? ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత నిఘా సంస్థల పాత్ర ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలను కథలో చూపించనున్నట్లు ఆర్జీవి వెల్లడించారు.

మోహిత్ సూరి దర్శకత్వం!

ఇప్పటివరకు ఆర్జీవి తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో రియలిస్టిక్ ట్రీట్‌మెంట్, క్రైమ్ ప్రపంచంలోని చీకటి కోణాలు మెయిన్ హైలెట్ అయ్యాయి. ఈ సన్నివేశాలు చూపించడంలో ఆర్జీవీ స్టైల్ వేరే లెవల్. అయితే, మోహిత్ సూరి సినిమాల్లో ఎమోషన్స్, బలమైన పాత్రలు, అద్భుతమైన మ్యూజిక్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పుడు, ఈ రెండు విభిన్నమైన ఆలోచనలు కలిస్తే గ్యాంగ్‌స్టర్ డ్రామా మరో స్థాయికి వెళ్లడం గ్యారెంటీ.

ఆర్జీవి చెప్పిన కథను విన్న మోహిత్ సూరి వెంటనే దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపించారట. అంతేకాదు, తనదైన శైలిలో ఎమోషనల్ క్యారెక్టర్లు, సంగీతం, రియలిస్టిక్ యాక్షన్‌తో కథను మరింత విస్తరించినట్లు ఆర్జీవి తెలిపారు. సో మొత్తానికి ఒక రేర్ కాంబినేషన్‌లో సాలీడ్ గ్యాంగ్‌స్టర్ మూవీ రూపొందనుంది.

#RGV#Ram Gopal Varma#Mohith Suri#Bollywood#Latest Cinema Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి