సినిమా

Tollywood: మెగాస్టార్ 'కాకా' మూవీలో రితికా సింగ్!ఆ విషయంలో అరుపులే..

4 నిమిషాల పఠనం

Tollywood: ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో వరుసగా కొత్త హీరోయిన్లకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే, కాకా మూవీలో అనస్వర రాజన్ చిరుకి కూతురు పాత్రలో నటిస్తుండగా, ఇప్పుడు ఇదే, సినిమాకు సంబంధించి రితికా సింగ్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గురు లాంటి సినిమాలలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రితికా.. చిరంజీవి సినిమాలో కనిపిస్తే ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుందనేది అందరిలోనూ మంచి క్యూరియాసిటీని పెంచేస్తుంది.

స్పెషల్ సాంగ్‌లో రితికా సింగ్?

తాజా సమాచారం ప్రకారం.. ‘కాకా’ సినిమాలో చిరంజీవి పక్కన రితికా సింగ్ ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ పాట షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. విజే శేఖర్ మాస్టర్ ఈ స్పెషల్ నంబర్‌కి డాన్స్ కొరియోగ్రఫీ అందించినట్టు సమాచారం. అయితే, ఇంకా ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేయలేదు.

ఇంతకముందు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమాలో కూడా రితికా సింగ్ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసి అలరించింది. ఇప్పుడు, మరోసారి మెగాస్టార్ సినిమాలో స్పెషల్ నంబర్‌కి ఆమెను ఎంచుకున్నారనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది. శేఖర్ మాస్టర్ డాన్స్ మూవ్‌మెంట్స్, చిరు గ్రేస్ కి రితికా గ్లామర్ తోడైతే గ్యారెంటీగా ఈ డాన్స్ నంబర్ సినిమాకి హైలెట్ కావడం పక్కా. ఇక, మెగా అభిమానులు థియేటర్స్‌లో చేసే హంగామా కూడా అంతా ఇంతా కాదు.

కాగా, చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించనుండటం విశేషం. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, సంగీత దర్శకుడు థమన్ కాకా ప్రమోషన్స్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని అధికారికంగా ఎక్స్ ద్వారా రివీల్ చేశాడు.

#Megastar Chiranjeevi#Kaaka Movie#Bobby Kolly#Rithika Singh#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి