సినిమా

Ashu Reddy: సుధీర్ తో పెళ్లి.. మొత్తానికి బయట పెట్టిన అషురెడ్డి

5 నిమిషాల పఠనం

Ashu Reddy: బుల్లితెర స్టార్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో యాంకర్ రష్మితో ఆన్‌స్క్రీన్ లవ్ ట్రాక్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్, ఆ తర్వాత ఛానల్ మారి బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో కలిసి చేసిన సందడి హాట్ టాపిక్‌గా మారింది.

Ashu Reddy: బుల్లితెర స్టార్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో యాంకర్ రష్మితో ఆన్‌స్క్రీన్ లవ్ ట్రాక్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్, ఆ తర్వాత ఛానల్ మారి బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో కలిసి చేసిన సందడి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'ఫ్యామిలీ స్టార్స్' షోలో అషురెడ్డి ఆప్యాయంగా సుధీర్‌ను 'బావ' అని పిలిచినప్పటి నుంచి, వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తోందంటూ ప్రచారం మొదలైంది. ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ రూమర్స్‌పై అషురెడ్డి స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టింది.

సుధీర్‌తో పెళ్లి వార్తలపై అషురెడ్డి ఏమన్నరంటే?

ప్రముఖ నటి సురేఖావాణి కూతురు సుప్రీత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'విజువల్ టాక్స్' పాడ్‌కాస్ట్ షోకి అషురెడ్డి గెస్ట్‌గా హాజరైంది. ఈ సందర్భంగా హోస్ట్ సుప్రీత సూటిగా సుధీర్ ప్రస్తావన తీసుకొస్తూ.. "మీ బావ సుడిగాలి సుధీర్‌తో నీకు పెళ్లి అంటున్నారు నిజమేనా? అసలు ఆయనతో నీ బాండింగ్ ఏంటి?" అని అడిగింది. దీనికి అషురెడ్డి కాస్త సిగ్గుపడుతూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. మా బావ చాలా మంచి వ్యక్తి. ఫ్యామిలీ స్టార్స్ షో కోసం గత రెండేళ్లుగా మేమిద్దరం కలిసి పని చేస్తున్నాం. ఆయన చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. షోలో తనపై ఎన్ని పంచులు వేసినా అస్సలు సీరియస్‌గా తీసుకోడు. పనిని కేవలం పనిలాగే చూస్తాడు.. షూటింగ్ అయిపోయిందా, ఇంటికి వెళ్లిపోయామా అన్నట్లుగా చాలా సింపుల్‌గా ఉంటాడు" అని అషురెడ్డి స్పష్టం చేసింది. తద్వారా సుధీర్‌తో తనకు కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందని, ప్రేమ, పెళ్లి వార్తలన్నీ కేవలం పుకార్లేనని మొత్తానికి క్లారిటీ ఇచ్చేసింది.

హరికి బైక్ గిఫ్ట్ ఇచ్చా.. కానీ ఎక్కించుకోలేదు

ఇక ఇదే షోలో మరో బుల్లితెర నటుడు హరితో తనకున్న అనుబంధం గురించి కూడా అషురెడ్డి సరదా విషయాన్ని పంచుకుంది. హరి తనకు చాలా మంచి ఫ్రెండ్ అని, ప్రస్తుతం తామిద్దరం కలిసి షోలు చేయడం లేదని తెలిపింది. అయితే గతంలో తాను హరికి ఒక బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చానని గుర్తుచేసుకున్న అషురెడ్డి, "బైక్ గిఫ్ట్‌గా తీసుకున్నాడు కానీ, ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను ఆ బైక్‌పై తీసుకెళ్లలేదు" అంటూ నవ్వుతూ చెప్పింది. మరోవైపు కమెడియన్‌గా, హోస్ట్‌గా అలరిస్తున్న సుధీర్ రీసెంట్‌గా 'గోట్' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

#Ashu Reddy#Sudigali Sudheer#Ashu Reddy Marriage#Sudheer Wedding News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి