తెలంగాణ

TG: సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరిపించండి.. సీఎంకు రాజాసింగ్‌ సంచలన లేఖ

3 నిమిషాల పఠనం

TG: హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో జరిగిన పలు వ్యవహారాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన లేఖ రాశారు.

TG: హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో జరిగిన పలు వ్యవహారాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన లేఖ రాశారు. సజ్జనార్ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఈ వ్యవహారాలన్నింటిపై సీబీఐతో గానీ లేదా జ్యుడీషియల్ విచారణతో గానీ నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కీలక కేసుల దర్యాప్తుపై రాజాసింగ్ ప్రశ్నలు..

తన లేఖలో ప్రధానంగా రెండు సంచలన కేసుల దర్యాప్తు తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ సీపీ సజ్జనార్ హయాంలో నమోదైన 'గోల్డ్ తెఫ్ట్' కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఇంతటి కీలకమైన కేసులో అసలు అరెస్టులు ఎందుకు జరగలేదని, దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా, 'హామ్ వే' కేసులోనూ దర్యాప్తు నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఈ కేసు విచారణలో ఇంతలా లేట్ జరగడానికి వెనుక ఉన్న అసలు కారణాలేంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

జనార్ధన్ ట్వీట్ తర్వాత మరిన్ని అనుమానాలు

ఇక ఇటీవల జనార్ధన్‌ వేసిన ట్వీట్ వ్యవహారం తర్వాత సజ్జనార్ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయని రాజాసింగ్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ వ్యవహారాలపై వెంటనే సీబీఐ విచారణ లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని సీఎంను కోరారు. ఎమ్మెల్యే రాజాసింగ్ రాసిన ఈ లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

#Telangana News#Raja Singh#T Raja Singh#Revanth Reddy#V C Sajjanar#Sajjanar#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి