సినిమా

Satvika Veeravalli: ఒక సినిమా కోసం వస్తే ఇంకో సినిమాలో ఛాన్స్..మళ్ళీ వెళ్ళాలనిపించలేదు!

4 నిమిషాల పఠనం

Satvika Veeravalli: ప్రస్తుతం, మన తెలుగుతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలలో వినిపిస్తున్న పేరు సాత్విక వీరవల్లి. యూఎస్‌లో పుట్టి పెరిగిన ఈ మిక్స్డ్ బ్రీడ్ ఐటీ జాబ్ వదిలేసి సినిమాలలోకి వచ్చేసింది. ఒక్క సినిమా చేసి తిరిగి అమెరికా వెళ్లిపోవాలనుకున్న సాత్విక..వరుస అవకాశాలు వస్తుండటంతో.. ఇక, ఆ జాబ్‌కి గుడ్‌బై చెప్పి తెలుగు, తమిళ సినిమాలకి సైన్ చేస్తోంది.

Satvika Veeravalli: ప్రస్తుతం, మన తెలుగుతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలలో వినిపిస్తున్న పేరు సాత్విక వీరవల్లి. యూఎస్‌లో పుట్టి పెరిగిన ఈ మిక్స్డ్ బ్రీడ్ ఐటీ జాబ్ వదిలేసి సినిమాలలోకి వచ్చేసింది. ఒక్క సినిమా చేసి తిరిగి అమెరికా వెళ్లిపోవాలనుకున్న సాత్విక..వరుస అవకాశాలు వస్తుండటంతో.. ఇక, ఆ జాబ్‌కి గుడ్‌బై చెప్పి తెలుగు, తమిళ సినిమాలకి సైన్ చేస్తోంది.

'కాంత' కోసం వస్తే:

సాత్విక వీరవల్లి ప్రయాణం మిగతా హీరోయిన్ల కంటే కాస్త భిన్నంగా సాగుతుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె ఇంజనీరింగ్‌తో పాటు మాస్టర్స్ పూర్తి చేశాసింది. ఆ తర్వాత, రెండేళ్ల పాటు ఓ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే, తనకు క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉండటంతో ఉద్యోగాన్ని వదిలేసి నటన వైపు అడుగులు వేసింది. మొదట 'కాంత' సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినా అవకాశం దక్కలేదు. అదే నిర్మాణ సంస్థ నుంచి మరో తమిళ సినిమా అవకాశం రావడంతో ఆమె నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

'ఆకాశంలో ఒక తార'తో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ!

ప్రస్తుతం సాత్వికకు మంచి గుర్తింపు తీసుకొస్తున్న సినిమా 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాధినేని దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇందులో, అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనే కల్పన అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించబోతోంది. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చేతిలో రెండు కొత్త సినిమాలు!

తాజాగా, సాత్విక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నానని, తెలుగులో కూడా మరో ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు తెలిపారు. త్వరలోనే, ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మేకర్స్ నుంచి వస్తాయని చెప్పారు. అంటే 'ఆకాశంలో ఒక తార' విడుదలకు ముందే రెండు భాషల్లోనూ కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా, తెలుగులో సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కనున్న ఆర్సీ 17లో సాత్వికకి ఛాన్స్ దక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి. బహుషా తెలుగులో ఇదే ఆమె కొత్తగా సీన్ చేసిన సినిమా కావచ్చు.

#Satvika Veeravalli#Aakasamlo Oka Tara#Pavan Sadineni#Dulquer Salmaan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి