సినిమా

Tollywood: విడిపోయినా కలిసే ఉంటున్నారా..రమ్యకృష్ణ బయటపెట్టిన ఆసక్తికరమైన విషయాలు

4 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రమ్యకృష్ణ.. ఇప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, రమ్యకృష్ణ 'బాహుబలి'లో చేసిన శివగామి పాత్రతో మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమాల కంటే కొన్నిసార్లు ఆమె వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా, దర్శకుడు కృష్ణవంశీతో ఆమె విడిపోయారంటూ చాలాకాలంగా అంతటా ప్రచారం జరుగుతోంది.

Tollywood: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రమ్యకృష్ణ.. ఇప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, రమ్యకృష్ణ 'బాహుబలి'లో చేసిన శివగామి పాత్రతో మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమాల కంటే కొన్నిసార్లు ఆమె వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా, దర్శకుడు కృష్ణవంశీతో ఆమె విడిపోయారంటూ చాలాకాలంగా అంతటా ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ వేర్వేరు నగరాల్లో ఉంటుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ, ఇవన్నీ కేవలం రూమర్స్‌గా ఆమె వెల్లడించారు.

గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ప్రచారంపై రమ్యకృష్ణ తాజాగా స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. కృష్ణవంశీ, రమ్యకృష్ణ ఇద్దరూ ఇప్పటికీ భార్యాభర్తలుగానే ఉన్నామని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే, వృత్తిపరమైన కారణాలతో వేర్వేరు నగరాల్లో ఉండాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. అంతమాత్రాన తమ మధ్య విభేదాలు ఉన్నట్లు కాదని ఆమె తెలిపారు.

కొడుకు ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం!

రమ్యకృష్ణ ఇంతకముందు కొంతకాలం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు, చెన్నైలో టెలివిజన్ సీరియల్ షూటింగ్ కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రయాణించాల్సి వచ్చేదని తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అయితే, రమ్యకృష్ణ అలా ప్రయాణించిన ప్రతిసారీ కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడట. పదే పదే జలుబు వంటి సమస్యలు రావడంతో కొడుకును చెన్నైలోనే చదివించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారట.

విడాకులంటూ వచ్చిన వార్తలకు చెక్!

రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారంటూ గతంలో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే, గతంలో కృష్ణవంశీ కూడా ఈ వార్తలను ఖండించారు. ఖాళీ సమయాల్లో తాను చెన్నైకి వెళ్తానని, రమ్యకృష్ణ హైదరాబాద్‌కు వస్తుంటారని క్లారిటీ ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించడం ఇష్టం ఉండదని కూడా ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ చెప్పారు. భార్యభర్తల కంటే కూడా మంచి స్నేహితులుగా ఎక్కువ ఉంటామని రమ్యకృష్ణ తెలిపారు. సో మొత్తానికి, గత కొంతకాలంగా వస్తున్న వార్తలన్నిటికీ తాజా ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చారు.

#Ramya Krishnan#Krishna Vamshi#Tollywood#Latest Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి