సినిమా

Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..

4 నిమిషాల పఠనం

Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..అంటోంది హీరోయిన్ అదిరావు హైదరి. అవ్ను..కథ, దర్శకుడే నా ప్రాధాన్యత. అంతే తప్ప ఇష్టం లేకుండా ఇప్పటి వరకూ ఏ కథను ఒప్పుకోలేదు..ఇకపై కూడా ఒప్పుకోను అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది అదితి రావు హైదరి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీస్‌లో మంచి కథా బలమున్న సినిమాలను చేసింది.

Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..అంటోంది హీరోయిన్ అదిరావు హైదరి. అవ్ను..కథ, దర్శకుడే నా ప్రాధాన్యత. అంతే తప్ప ఇష్టం లేకుండా ఇప్పటి వరకూ ఏ కథను ఒప్పుకోలేదు..ఇకపై కూడా ఒప్పుకోను అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది అదితి రావు హైదరి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీస్‌లో మంచి కథా బలమున్న సినిమాలను చేసింది.

కానీ, గత కొంతకాలంగా ఈ బ్యూటీకి హీరోయిన్‌గా అవకాశాలు అందుకోలేకపోతోంది. ఈ విషయంలో ఇంకా ఎదురుచూస్తోందని కూడా తెలిపింది. మంచి పాత్రల కోసం నన్ను ఖచ్చితంగా సంప్రదిస్తారని..అలాంటి పాత్రల కోసం పోరాడాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. నిజంగా, మంచి కథ-పాత్ర దక్కితే అదితి అద్భుతంగా నటిస్తుంది. ఈ విషయం హిందీలో వచ్చిన భూమి సినిమా..తెలుగులో వచ్చిన మహాసముద్రం, సమ్మోహనం, వి లాంటి సినిమాలే.

నచ్చిన పాత్రలకే ప్రాధాన్యత..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు రావడం కంటే, వచ్చిన అవకాశాల్లో మంచి పాత్రలను ఎంచుకోవడమే పెద్ద సవాలుగా మారింది. గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు అంటూ చాలామంది హీరోయిన్స్ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, పట్టుమని నాలుగు సినిమాలు చేయలేకపోతున్నారు. రెండు ఫ్లాప్స్ రాగానే అవకాశాలు కరువవుతున్నాయి.

ఇక, అదితి రావు హైదరి కథలో తనకు నచ్చే అంశం ఉందా లేదా అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే, మిగతా హీరోయిన్స్ మాదిరిగా వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయలేకపోతోంది. అదితి కెరీర్‌ను గమనిస్తే.. ఆమె ఎప్పుడూ ఒకే తరహా పాత్రలకు పరిమితం కాలేదు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా, తాను ఎంచుకున్న సినిమాలలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఏదో తెరపై కనిపించాలనే ఉద్దేశంతో సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదనే అభిప్రాయం ఆమె మాటల్లోనే తెలుస్తోంది. కథ నచ్చితేనే సినిమా చేయాలనే ఆలోచనతో ఉండటం ఆమె కెరీర్‌కు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో వరుసగా సినిమాలు రావడం కష్టం అన్న విషయాన్ని గమనించుకోవాలి. మరి, ఈ విషయంలో అదితి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది.

#Aditi Rao Hydari#Actress Aditi Rao Hydari#Tollywood#Bollywood#Latest Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి