సినిమా

Keerthy Suresh: ధనుష్, దుల్కర్‌లతో కీర్తికి పోటీ అవసరమా?

4 నిమిషాల పఠనం

Keerthy Suresh: ఇద్దరు స్టార్ హీరోలతో మహానటి కీర్తి సురేష్ ఈ నవంబర్ 20న పోటీ పడబోతోంది. ఆ సినిమా సత్యవాన్ సావిత్రి..ఆ హీరోలు కోలీవుడ్ స్టార్ ధనుష్..మాలీవుడ్ దుల్కర్ సల్మాన్. వీరి సినిమాలు ఓం, ఆకాశంలో ఒక తార చిత్రాలు. ఈ మూడు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. కానీ, ఇది కీర్తికి అవసరమా! అంటూ కొందరు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Keerthy Suresh: ఇద్దరు స్టార్ హీరోలతో మహానటి కీర్తి సురేష్ ఈ నవంబర్ 20న పోటీ పడబోతోంది. ఆ సినిమా సత్యవాన్ సావిత్రి..ఆ హీరోలు కోలీవుడ్ స్టార్ ధనుష్..మాలీవుడ్ దుల్కర్ సల్మాన్. వీరి సినిమాలు ఓం, ఆకాశంలో ఒక తార చిత్రాలు. ఈ మూడు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. కానీ, ఇది కీర్తికి అవసరమా! అంటూ కొందరు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

సౌత్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో పోటీ పడటం, వారి స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా, హీరోయిన్లకు ఈ పోటీ మరింత ఠఫ్‌గా ఉంటుంది. అయితే, హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి హీరోలతో పోటీ పడాల్సిన అవసరం కీర్తికి ఉందా? లేక తనకంటూ ఒక ప్రత్యేకమైన కెరీర్‌ను నిర్మించుకోవడమే లక్ష్యమా? ఇదీ, ఇప్పుడు జరుగుతున్న టాక్.

నవంబర్ 20న బాక్సాఫీస్ పరీక్ష..

నవంబర్ 20న కీర్తి సురేష్ నటించిన 'సత్యవాన్ సావిత్రి' చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో కీర్తి లాయర్ పాత్రలో నటించింది. దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ రూపొందించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో దర్శకుడు మిస్కిన్ కీలక పాత్ర పోషించాడు. అదే రోజున ధనుష్, మమ్ముట్టి కలిసి నటించిన తమిళ చిత్రం 'ఓమ్' కూడా విడుదలవుతోంది. మరోవైపు, దుల్కర్ సల్మాన్ నటించిన 'ఆకాశంలో ఓ తార' తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా, ఒకే రోజు ముగ్గురు స్టార్స్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి.

గత కొంతకాలంగా కీర్తి సురేష్ నటించిన సినిమాలేవీ హిట్ సాధించడం లేదు. ఇటీవల ఓటీటీలో వచ్చిన అక్క సిరీస్ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అంతకముందు వచ్చిన బేబీ జాన్ ఫ్లాప్ అయింది. అలాగే, తెలుగు..తమిళ భాషల్లో ఈ మధ్య వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరి, సత్యవాన్ సావిత్రి అయినా కీర్తికి హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా చూడాలి. ఇక, 2027 జనవరి లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 విడుదల సినిమా రిలీజ్ కాబోతోంది.

#Keerthy Suresh#Sathyavan Savithiri#Kollywood#Latest Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి