సినిమా

Tollywood: హారిక&హాసిని షాకింగ్ డెసిషన్..త్రివిక్రమ్ తో కటీఫ్?

4 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి హారిక అండ్ హాసిని. ఇది, మన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అత్యంత సన్నిహితుడైన ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కి సంబందించింది. అంతేకాదు, స్వయంగా రాధాకృష్ణతో ఈ బ్యానర్‌ను ప్రారంభించింది గురూజీనే. కానీ, ఇప్పుడు వీరిద్దరు విడిపోనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి హారిక అండ్ హాసిని. ఇది, మన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అత్యంత సన్నిహితుడైన ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కి సంబందించింది. అంతేకాదు, స్వయంగా రాధాకృష్ణతో ఈ బ్యానర్‌ను ప్రారంభించింది గురూజీనే. కానీ, ఇప్పుడు వీరిద్దరు విడిపోనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.

అసలు కారణాలేంటి?

ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమాలు ఈ మధ్య ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. తీవ్రంగా నష్టాలను తెస్తున్నాయి. మరీ, ముఖ్యంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఈ సంస్థకి భారీ నష్టాలు వచ్చినట్టుగా టాక్ ఉంది. గుంటూరు కారం, ఇటీవల వచ్చిన ఆదర్శకుటుంబం సినిమాల వల్ల బాగానే నష్టాలు వచ్చాయి. అటు సితార నాగవంశీకి కూడా లాభాలకంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి. దీంతో, త్రివిక్రమ్-రాధాకృష్ణ వేరవ్వాలని చూస్తున్నారట.

అదే జరిగితే గాడ్ ఆఫ్ వార్ ఏమవుతుంది?

హారిక అండ్ హాసిని నిర్మాణంలో ఎన్‌టిర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రూపొందాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం గురూజీ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ ఇచ్చారట. కానీ, ఆదర్శకుటుంబం మూటగట్టుకున్న నష్టాల కారణం ఒకటైతే, త్రివిక్రమ్-రాధాకృష్ణ వేరవడం ఇంకో కారణం వల్ల త్రివిక్రమ్-ఎన్‌టిర్ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. దీనిపై, స్వయంగా నిర్మాత గానీ, త్రివిక్రమ్ గానీ స్పందిస్తే అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.

అవన్నీ రూమర్సేనా?

అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని గురూజీ సన్నిహితులు చెబుతున్నారట. నిర్మాత ఎస్. రాధాకృష్ణతో త్రివిక్రమ్ శ్రీనివాస్ విడిపోతున్నారని వస్తున్నవన్నీ కేవలం రూమర్సేనని తెలుస్తోంది. ఎన్‌టిర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ షూట్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో సైలెంట్‌గా గాడ్ ఆఫ్ వార్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ టీమ్ పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి, తారక్ ఫ్రీ ఐపోగానే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి అన్నీ కార్యక్రమాలను పక్కాగా పూర్తి చేస్తున్నారట. త్వరలో, దీనిపై అఫీషియల్‌గా కన్‌ఫర్మేషన్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.

#Trivikram Srinivas#S.Radhakrishna#Haarika & Hassine Creations#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి