సినిమా

Tollywood: సుబ్రహ్మణ్య స్వామి కథ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..

4 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్‌లో తనదైన మాటల మాయాజాలంతో, విభిన్నమైన కథా రచనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవలే, ఆయన వెంకటేష్ హీరోగా ఆదర్శకుటుంబం సినిమాను రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద గురూజీ ఫోకస్ చెశాడు.

Tollywood: టాలీవుడ్‌లో తనదైన మాటల మాయాజాలంతో, విభిన్నమైన కథా రచనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవలే, ఆయన వెంకటేష్ హీరోగా ఆదర్శకుటుంబం సినిమాను రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద గురూజీ ఫోకస్ చెశాడు.

ఒక భారీ పౌరాణిక చిత్రం రూపొందించనున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి

'గాడ్ ఆఫ్ వార్' అనే పేరు ప్రచారంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ లేదా కార్తికేయుడి జీవితగాథ నేపథ్యంలో ఈ సినిమా

ఉండబోతోందనే చర్చ సాగుతోంది. అయితే, ఈ సినిమా ప్రకటనతోనే ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామి

అసలు పురాణ గాథను త్రివిక్రమ్ యథాతథంగా తెరకెక్కిస్తారా? లేక తనదైన కథన శైలిలో కొన్ని మార్పులు చేస్తారా? అన్న

ప్రశ్నలు భక్తుల్లోనూ, సినీ అభిమానుల్లోనూ వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం మేరకు, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కథలో మార్పులు చేస్తున్నారట. వాస్తవానికి, ఈ సినిమాకి ఫైనల్ వెర్షన్

కూడా పూర్తైంది. తారక్‌తో కూడా చెప్పారు. కొన్ని సన్నివేశాలను మాత్రమే ఫైనల్ చేయాల్సి ఉంది. ఇదే, విషయాన్ని..ఇటీవల

జగపతిబాబు హోస్ట్‌గా వస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో వెల్లడించారు. కానీ, ఇప్పుడు..మళ్ళీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ను

మార్చక తప్పడం లేదట. దీనికి, కారణం ధనుష్ సినిమా అని తెలుస్తోంది.

ఈ సినిమాకి పోటీగా ధనుష్ – వెట్రిమారన్ కలయికలో ‘తమిళ్‌ మురుగన్’ తెరకెక్కనుంది. రెండు చిత్రాలు సుబ్రహ్మణ్య స్వామి

కథ ఆధారంగా రూపొందనున్నాయి. అందుకే, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ సినిమా కథా గమనాన్ని మారుస్తున్నారట. అందులో,

భాగంగానే సినిమాలో ప్రస్తుత కాలానికి సంబంధించిన భాగాన్ని కూడా చూపించనున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే, ఇటీవల వచ్చిన

ఆదర్శకుటుంబం ఫలితంతో..నిర్మాత బడ్జెట్ విషయంలో వెనకడుగు వేసినట్టుగా వార్తలు వచ్చాయి.

#Trivikram#NTR#God Of War#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి