సినిమా

Tollywood: కాజల్ కెరీర్ ఖతమవ్వకుండా ఉండాలంటే!

4 నిమిషాల పఠనం

Tollywood: ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగిన కాజల్ అగర్వాల్ కెరీర్ గ్యారెంటీగా డేంజర్ జోన్‌లో ఉందని చెప్పక తప్పదు. చందమామ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కాజల్, మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఒకదశలో డేట్స్ సర్దుబాటు కాక చాలా సినిమాలను వదులుకున్న పరిస్థితి. హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న రోజులున్నాయి. స్పెషల్ నంబర్ చేసినా భారీ రెమ్యునరేషన్. అలాంటి, కాజల్ కెరీర్ ఇప్పుడు ఉసూరుమంటోంది.

పెళ్ళి వల్ల కాజల్ కెరీర్ తిరగబడిందా?

కాజల్ అగర్వాల్ దాదాపు 15 ఏళ్ళపాటు అద్భుతమైన కెరీర్‌ని లీడ్ చేసింది. ఇటు తెలుగు అటు తమిళంలో దాదాపు అగ్ర హీరోలందరితోనూ జతకట్టి భారీ విజయాలను అందుకుంది. స్టార్ హీరోయిన్ అంటే అప్పుడు అందరూ కాజల్ వైపే చూసేవారు. కానీ, ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో తన స్నేహితుడు గౌతం కిచ్లును పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతైనా కీర్తి సురేష్ మాదిరిగా సినిమాలు ఒప్పుకుంటుందనుకుంటే..ఓ బిడ్డకి తల్లై బ్రేక్ తీసుకుంది.

ఈ సమయంలో కాజల్ ఫిజిక్‌లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో, కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా డైట్, ఫిట్‌నెస్ వల్ల కాస్త చూడటానికి ఇంపుగా కనిపించే ఫొటోషూట్స్‌తో మేకర్స్‌ను ఆకట్టుకొని భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా, కాజల్‌కి అంతగా కలిసొచ్చిందేమీ లేదు. ఇటీవల వచ్చిన రామాయణలో మండోదరిగా నటించినా..స్క్రీన్ మీద కనీసం 5 నిముషాలు కనిపించలేదు.

ఇప్పుడున్న ఒకే ఒక్క అవకాశం..మరోసారి బాలయ్యతో చేస్తిన్న దాదా సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకూ కాజల్ పాత్రను రివీల్ చేయలేదు. కానీ, గోపీచంద్ గత సినిమాలను చూసుకుంటే, హీరోయిన్‌కి బలమైన పాత్ర ఉంటుందనుకోవచ్చు. ఈ సినిమాలో గనక కాజల్ పాత్రకి ప్రశంసలు దక్కితే మళ్ళీ టాలీవుడ్‌లో పుంజుకోవచ్చు. లేదంటే, దాదాపుగా తెలుగులో దాదా సినిమానే అఖరిది కావచ్చు. కాజల్ కెరీర్ ఖతం కాకుండా ఉండాలంటే గోపీచంద్ మలినేని చేతిలోనే ఉంది.

#Balakrishna#Daadaa#NBK 111#Gopichand Malineni#Kajal Aggerwal#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి