సినిమా

Dulquer Salmaan: అందరిలా ఆలోచిస్తే అతను దుల్కర్ ఎందుకవుతాడు!

4 నిమిషాల పఠనం

Dulquer Salmaan: సాధారణంగా హీరో అనగానే మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటుంటారు. ముఖ్యంగా, మన తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీలు ఫ్యాన్ బేస్డ్ కావడం దీనికి, ప్రధాన కారణం. అయితే, ఎప్పుడు అభిమానులు ఒకే తరహా కథలను చేస్తుంటే ఒప్పుకోవడం లేదు. భిన్నమైన కథలతో వచ్చే సినిమాలంటేనే ఎక్కువగా ఆదరణ చూపిస్తున్నారు. కానీ, మన హీరోలు మాత్రం..అరిగిపోయిన జానర్ కథల చుట్టూనే తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి పూర్తి భిన్నంగా ఉన్నాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.

నిజమే, అందరిలా మాస్ కథలను చేస్తూ ఉంటే అతను దుల్కర్ ఎందుకవుతాడు. గత కొంతకాలంగా ఈ హీరో ఎంచుకునే కథలే ఎంతో విభిన్నంగా ఉంటాయి. రొటీన్ ఫార్ములా కథలకి ఆమడదూరం ఉంటున్నాడు. ఒక్కో సినిమాను ఎంతో సున్నితమైన అంశంతో ముడిపడి ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మలయాళంలో కంటే దుల్కర్ సినిమాలు తెలుగులోనే ఎక్కువ ఆదరణను దక్కించుకుంటున్నాయి.

మహానటితో మొదలు:

దుల్కర్ సల్మాన్ నటించిన మొదటి సినిమా మహానటి. ఇందులో, ఆయన పోషించిన జెమినీ గణేషన్ పాత్రకి ప్రాణం పోశారు. కీర్తి సురేష్ సావిత్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో దుల్కర్ తెలుగు ఆడియన్స్‌ను బాగా సంపాదించుకున్నాడు. వైజయంతి మూవీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ.. అలాగే, గీతా ఆర్ట్స్ లాంటి బిగ్ బ్యానర్ దుల్కర్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయంటే, ఆయన మార్కెట్ తెలుగులో ఎంతగా పెరిగిందో..నిర్మాతలకి ఎలా లాభాలను తెచ్చిపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మన తెలుగు స్టార్ హీరోలు కూడా ధైర్యం చేయని సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలను ఎంచుకుంటున్నాడు. మలయాళ హీరో అనే విషయాన్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. కాబట్టే, సీతారామం.. లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నాయి. త్వరలో, ఆకాశంలో ఒక తార, ఆ తర్వాత శ్రీశ్రీ సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు దుల్కర్ సల్మాన్. నిర్మాతలకి అందుబాటులో ఉంటూ..తెలుగులో స్ట్రైట్ సినిమాలను చేసూ..మంచి కమర్షియల్ హిట్స్ అందుకుంటున్న దుల్కర్..చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పక తప్పదు.

#Dulquer Salmaan#Aakasamlo Oka Tara#Tollywood#Sri Sri Movie
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి