మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్ 15, 2026 నుంచి జనవరి 19, 2027 వరకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొళ్లం మధ్య వివిధ మార్గాల్లో మొత్తం 54ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో (CPRO) ఎ.శ్రీధర్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయంతో అయ్యప్ప మాలధారులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
రైల్వే శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్-కొళ్లం(07193) ప్రత్యేక రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కొళ్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొళ్లం-హైదరాబాద్ (07194) రైలు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
అదేవిధంగా నాందేడ్ నుంచి ప్రత్యేక రైలు (07189) నవంబర్ 15న సాయంత్రం 5.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకోగా, తిరుగు ప్రయాణంలో (07190) నవంబర్ 17న ఉదయం 10.55 గంటలకు కొళ్లంలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఇక చర్లపల్లి స్టేషన్ నుంచి కొళ్లం మధ్య అత్యధిక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి - కొళ్లం (07180) ప్రత్యేక రైలు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07181) నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి వస్తుంది.
అదేవిధంగా (07195) రైలు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరనుండగా, తిరుగు ప్రయాణంలో (07196) నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
మరోవైపు చర్లపల్లి - కొళ్లం (07197) రైలు డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరనుండగా, తిరుగు ప్రయాణంలో (07198) డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చివరగా చర్లపల్లి - కొళ్లం (07199) ప్రత్యేక రైలు డిసెంబర్ 30, జనవరి 6, 19 తేదీల్లో రాత్రి 10.40 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07200) జనవరి 1, 8, 15 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకుని ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని సూచించారు.


