తెలంగాణ

TG : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ఘోరప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!

4 నిమిషాల పఠనం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పెను ప్రమాదం తప్పింది. ఆయన చేపట్టిన పాదయాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా అనాజీపురం చౌరస్తా వద్ద పాదయాత్ర తిరుమలగిరి వైపు కొనసాగుతుండగా ప్రమాదవశాత్తు మల్లన్న కారును లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పెను ప్రమాదం తప్పింది. ఆయన చేపట్టిన పాదయాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా అనాజీపురం చౌరస్తా వద్ద పాదయాత్ర తిరుమలగిరి వైపు కొనసాగుతుండగా ప్రమాదవశాత్తు మల్లన్న కారును లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అనంతరం మల్లన్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టినట్టు సమాచారం.

అయితే, మరో కారులో తిరుమలగిరికి చెందిన భార్యాభర్తలు మేడబోయిన సాయినాథ్‌, చందన ఉన్నారు. ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.అయితే, వారి రెండేళ్ల కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో మల్లన్న కారులో లేరని తెలుస్తోంది. అయితే, మల్లన్న వాహనంలో ఉన్న డ్రైవర్ బన్నీ, ఆయన సన్నిహితుడు రంగన్నలకు తీవ్ర గాయాలవ్వగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

TG :  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ఘోరప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!

క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మల్లన్న హుటాహుటిన హాస్పిటల్ బయలు దేరినట్టు సమాచారం. కాగా, పాదయాత్ర సమయంలోనే ఈ ప్రమాదం జరగడంపై టీఆర్పీ నాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఇది కేవలం రోడ్డు ప్రమాదమేనా? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా? అని మల్లన్న సహచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

TG :  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ఘోరప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!

ఎందుకంటే రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ సర్పంచ్‌తో టీఆర్‌పీ పాదయాత్ర సందర్భంగా గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, సరిగ్గా మల్లన్న పాదయాత్ర సమయంలో ఈ ప్రమాదం జరగడంపైనా జోరుగా చర్చ నడుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.

#teemar mallanna#car accident#yadadri district#crime#TRP#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి