Bollywood: కియారా అద్వానికి ఇంటిమేట్ సీన్స్ అంటే బాగా ఇష్టమని అర్థమవుతోంది. అంటే, ఆ తరహా సన్నివేశాలలో నటన పరంగా నిరూపించుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి కియారా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందని తెలుస్తోంది. పైగా, తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా వీటి గురించి అసలు అడగడు..పట్టించుకోడు అంటోంది.
తెలుగులో కియారా అద్వానీ నటించిన మొదటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను'. ఈ సినిమాలో 'వసుమతి' పాత్రలో ఎంతో డీసెంట్ పాత్రను పోషించి టాలీవుడ్ ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చేసే అవకాశం అందుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.
అయితే, ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. ఇదే కాదు, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా డిజాస్టర్. దాంతో మళ్ళీ కియారా తెలుగులో నటించే అవకాశాలు దక్కలేదు. కానీ, భారీ పాన్ ఇండియా సినిమా 'టాక్సిక్'లో మాత్రం ఏకంగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక్కడ, ఎవరూ ఊహించని విషయం ఏమిటంటే, 'టాక్సిక్'లో యష్‌తో కలిసి కియారా చేసిన ఇంటిమేట్ సీన్స్. పెళ్లి తర్వాత కూడా ఇలాంటి హై ఓల్టేజ్ రొమాంటిక్ క్యారెక్టర్ చేయడం..బికినీ సూట్..లిప్ లాక్స్ అంటే సాధారణంగా పెళ్ళైన వాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉంటాయి.
కానీ, కియారాకి అవేమీ లేవని 'టాక్సిక్' చూస్తేనే అర్థమవుతుంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగితే..అసలు 'టాక్సిక్' సినిమా గురించి గానీ, అందులో తాను నటించిన ఇంటిమేట్ సీన్స్ గురించి గానీ తన భర్త సిద్ధార్థ్ ప్రస్తావించలేదట. దీన్ని కూడా నటనలో భాగంగానే చూస్తాడని పైపెచ్చు సర్దిచెప్పింది. పెళ్లికి ముందు కూడా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో చేసిన ఘాటు సన్నివేశాలు మగవాళ్ళకి మత్తెక్కించింది. నటనలో భాగంగా కియారా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి అసలు వెనకాడదని క్లియర్‌గా అర్థమవుతోంది. మన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రూపొందించిన కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్లో కియారా ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.


