Tollywood: మన హీరోలు ఒక్కొక్కరు ఒక్కో మ్యానరిజంతో ఆకట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. సినిమాకో ఆటిట్యూడ్ చూపిస్తే జనాలకి కూడా కొత్తగా ఉంటుంది. ప్రతీ సినిమాలో ఒకే తరహా బాడీ లాంగ్వేజ్..మేకోవర్..డైలాగ్ మాడ్యులేషన్ అంటే బోర్ కొట్టేస్తుంది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డకి కూడా ఇదే సమస్య వచ్చి ఫ్లాపులు పడ్డాయి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి.
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత వరుసగా రెండు ఫ్లాపులు రావడానికి కారణం..సిద్దు, టిల్లు పాత్ర నుంచి బయటకి రాకపోవడమే అని సినిమా రివ్యూలలో రాసుకొచ్చారు. జాక్ అనే సినిమాను చేశాడు సిద్దు. ఈ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటించింది. సినిమా విడుదల కాకముందు మంచి హైప్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్..సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో జాక్ సూపర్ హిట్ అనే నమ్మకాలను కలిగించింది.
కానీ, రిలీజైయ్యాక మాత్రం.. ఏమత్రం ఆకట్టుకోలేని కథ-కథనాలు, సిద్ధు రొటీన్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద జాక్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కోన నీరజ దర్శకత్వంలో 'తెలుసు కదా'..అనే సినిమా వచ్చింది. హీరోయిన్స్‌గా శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా నటించారు. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చింది. యూత్ ఆడియన్స్ కోసమే తీసిన సినిమా అని ప్రమోషనల్ కంటెంట్‌తో ఊపొచ్చింది.
కానీ, 'తెలుసు కదా' మూవీ కూడా సిద్ధుకి హిట్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా అదే కామెంట్స్ వినిపించాయి. ఏమాత్రం మన స్టార్ బాయ్ బాడీ లాంగ్వేజ్ మారలేదని మాట్లాడుకున్నారు. పైగా ఇది పరమ రొటీన్ కథ కావడం పెద్ద మైనస్ అయింది. ఇలా, ఏడాది గడిచింది. ఇప్పుడు సుకుమార్ నిర్మాణంలో ఆయన శిష్యుడు బి.మహేష్ దర్శకతంలో సిద్దు కెరీర్లో 10వ సినిమా ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలలో ప్రారంభించారు.
డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. అయితే, ఇప్పటివరకూ సిద్ధు చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగా గనక తన పర్ఫార్మెన్ ఉంటే ఖచ్చితంగా హిట్ కొట్టొచ్చు. మంచి కథ-కథనాలతో సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. ఒకవేళ సిద్ధు అదే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తే జనాలకి మొనాటనీ వచ్చి ఆదరించకపోవచ్చు.


