Tollywood: మన టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. దాదాపు 1400కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి ఇప్పుడు బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న.
అయితే, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంకి కూడా ఒకవైపు నుంచి ప్లాన్స్ మొదలుపెట్టినట్టుగా తాజా సమాచారం. ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తయారు చేసేపనిలో ఉన్నారు. వాస్తవానికి, మహాభారతం సినిమాను రాజమౌళి ఎప్పుడో రూపొందించాల్సి ఉండగా..బడ్జెట్..ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్..తగిన స్టార్స్ ఇలా అన్నిటిపైనా గ్రిప్ వచ్చాకే మహాభారతం చేయాలని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు.
బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయి క్రేజ్..ఇప్పుడు రూపొందిస్తున్న వారణాసి సినిమాతో మొత్తం గ్లోబల్ రేంజ్లో మార్కెట్‌ను తన చేతికి వచ్చేలా వ్యూహాలు వేస్తున్నారు. ఆయన వారణాసి సినిమాకి చేస్తున్న బిజినెస్ స్ట్రాటజీ చూస్తుంటే..ఇక, మన తెలుగు సినిమా హాలీవుడ్ వాళ్ళకి ఏమాత్రం తగ్గదని అర్థమవుతోంది. ఇక, ఆయన టార్గెట్ మొత్తం వారణాసి తర్వాత మహాభారతం సినిమానే అని అర్థమవుతోంది.
ఇక, ఈ సినిమాకి నిర్మాత నమిత్ మల్హోత్రా అని తెలుస్తోంది. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా రామాయణ పార్ట్ 1 సంచలన విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా రెండు భాగాలకి నమిత్ మల్హోత్రా 4000 కోట్ల రూపాయలను కేటాయించారట. ఆయనే, రాజమౌళితో మహాభారతం అత్యన్నత అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రాజమౌళి నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


