Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి మొత్తానికి తాజాగా కమెడియన్ ప్రవీన్ పంచుకున్న అప్డేట్తో మెగా అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాలలోనూ ఈ ప్రాజెక్ట్ పక్కన పడలేదని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో, తాజా సమాచారం మేరకు మెగాస్టార్ విశ్వంభర చిత్రాన్ని 2027 జనవరి 26న ప్రపచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సైలెంట్‌గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే, విశ్వంభర సినిమా విడుదల ఆలస్యం అయి పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో మెగా అభిమానుల్లోనే కాకుండా కామన్ ఆడియన్స్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగడం కష్టమైన పరిస్థితి. అందుకే, ఇప్పుడు మేకర్స్ అన్నీ రకాలుగా ప్రాజెక్ట్‌పై హైప్ పెరిగేందుకు సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారట. దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాకి సంబందించిన ప్రతీ విషయాన్ని ఓ ట్రైలర్ కట్లా చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా, మేకింగ్ విజువల్స్..చిరు మేకోవర్ వీడియోతో పాటు రా ఫుటేజ్, ఇతర నటీనటులకి సంబందించిన పాత్రల తాలూకు విజువల్స్, కాస్ట్యూంస్..భారీగా వేసిన సెట్ వీడియోస్..ఇలా ప్రతీ ఒక్కటి ప్రమోషనల్ కంటెంట్‌లో ఉండేలా డిజైన్ చేస్తున్నారట. విశ్వంభర ప్రమోషన్స్ మొదలవగానే ఇలా..ఒక్కో సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌ను వదులుతూ వస్తారట. విరివిగా ఈ సినిమా గురించి ప్రచారం చేయనున్నట్టు సమాచారం. యూవీ వారు కూడా విశ్వంభర ప్రమోషన్స్‌కి ప్రత్యేకించి బడ్జెట్ కూడా కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
గ్యాప్ లేకుండా టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషనల్ టీమ్ ఇంటర్వ్యూస్ రాబోతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు. వాస్తవానికి, సంక్రాంతికి కాకా చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి, విశ్వంభర జనవరి 13న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, ఇంకా వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ముందు ప్రకటించినట్టుగానే కాకా చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేసి, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ విశ్వంభర భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో, అప్డేట్స్ రానున్నట్టు సమాచారం.


